YSRCP DSC 2025 Allegations: డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ అదే పనిగా విషప్రచారం చేస్తోంది. అవి రోజురోజుకు శృతిమించి కులాల వద్దకు కూడా చేర్చింది వైయస్సార్ కాంగ్రెస్. గతంలో కమ్మ డీఎస్పీలు అంటూ 2019 ఎన్నికలకు ముందు హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తీరా వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీకి చెందిన మంత్రి కమ్మ డీఎస్పీలు కాదు.. అన్ని వర్గాల వారికి అవకాశం ఇచ్చారని శాసనసభలో ప్రకటించారు. అయితే ఇప్పుడు డీఎస్సీ 2025 పై దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. స్పోర్ట్స్ కోటా కింద కమ్మ సామాజిక వర్గం వారికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని చెబుతూ.. కమ్మ డీఎస్పీ అంటూ ప్రచారాలు ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం చానల్స్ లో కూర్చోబెట్టి.. రిటైర్మెంట్ తీసుకున్న అధికారులతో కమ్మ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ విషం చిమ్మడం మొదలుపెట్టారు.
* తప్పు అని తేల్చిన ఫ్యాక్ట్ చెక్..
డీఎస్సీ 2025 పై ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ అధికారులు ఓపికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కమ్మ డీఎస్సీ ఆరోపణలపై కూడా ఏపీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగి.. అదంతా తప్పుడు ప్రచారం అని తేల్చేసింది. ఈ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన పోస్టులు 381. ఈ 381 పోస్టుల్లో ఓపెన్ క్యాటగిరి కింద ఉన్నవి కేవలం 42 పోస్టులు మాత్రమే. మిగిలిన పోస్టులన్నీ ఎస్సీ, ఎస్ టి, బిసి, మైనారిటీ వర్గాలకు దక్కాయి. ఈ వివాదానికి ప్రధాన కారణం ఆనాలపై రెండు ఓపెన్ క్యాటగిరి పోస్టులు వాటిని పరిశీలిస్తే అందులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు వచ్చినవి కేవలం 9 పోస్టులు మాత్రమే. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు పది పోస్టులు, కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు అత్యధికంగా 16 పోస్టులు వచ్చాయి.
* ఇచ్చినవి తొమ్మిది పోస్టులే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పుడు అని అందరికీ తెలుసు. ఎందుకంటే 381 పోస్టుల్లో.. 9 పోస్టులు అంటే కనీసం మూడు శాతం కూడా లేవు. కానీ ఏ లెక్క ప్రకారం స్పోర్ట్స్ కోటా మొత్తం ఒకే కులానికి కట్టబెట్టారు.. ఇందులో భారీ స్కాం జరిగింది అంటూ తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్. కేవలం మెరిట్, క్రీడా సర్టిఫికెట్ల స్క్రూట్ని ఆధారంగా జరిగిన ఈ నియామక ప్రక్రియను.. ఒక కులానికి ఆపాదించి వివాదం చేయడం చూస్తుంటే కుట్ర కోణం అర్థం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ ఆరాటం కోసమే నిరుద్యోగ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. దాదాపు ఆరు లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయడంతో వారిలో గందరగోళం రేపి రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అది వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే ఆధారాలు లేని ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఆధారాలు లేని కారణంగా ఆ యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోను డిలీట్ కూడా చేసింది. కానీ వదిలిపెట్టే ప్రసక్తి కనిపించడం లేదు. నేరుగా సజ్జల ఫండింగ్ చేసిన ఆ ఛానల్ సంగతి తేల్చాలన్న అభిప్రాయం కూటమి శ్రేణుల్లో వినిపిస్తోంది.

