Peddi Overseas Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిదో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పడిపోయే ఈ కాలం లో , పది రోజులు దాటినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ‘పెద్ది’ చిత్రం రాబడుతున్న వసూళ్లను చూసి , ఆరు నెలల నుండి వ్యాపారం లేక , థియేటర్స్ ని మూసుకున్న బయ్యర్స్ , ఎక్సిభిటర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నేటి తో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్, ఎక్సిభిటర్స్ లాభాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ చిత్రం ఓవర్సీస్ మరియు నార్త్ ఇండియా మార్కెట్స్ లో ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. రివ్యూస్ అద్భుతంగా ఉన్నాయి, పబ్లిక్ మౌత్ టాక్ కూడా బాగుంది, కానీ ఎందుకు ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో , ఎవరికీ అంతు చిక్కడం లేదు.
నార్త్ ఇండియా లో కూడా ఇదే పరిస్థితి. ఇలాంటి సినిమాలను బాలీవుడ్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు. కానీ ఎందుకో ఈ సినిమాలో అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ఆదరించలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి హిందీ వెర్షన్ లో కేవలం 28 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 10 మిలియన్ డాలర్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, పది రోజులకు కలిపి కనీసం 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. దాదాపుగా 50 కోట్ల రూపాయిల నష్టం ఒక్క ఓవర్సీస్ ప్రాంతాల్లోనే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ స్థాయి రన్ ని సొంతం చేసుకుంటున్న ఈ చిత్రానికి, ఓవర్సీస్ లో ఈ రేంజ్ ఫలితం రావడం ఏంటో అని ట్రేడ్ పండితులకు కూడా అంతు చిక్కడం లేదు.
అయితే నిన్న ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో ‘పెద్ది’ ఓవర్సీస్ పెర్ఫార్మన్స్ పై రిపోర్టర్ ఒక ప్రశ్న అడగ్గా , అందుకు నిర్మాత సతీష్ కిలారి సమాధానం చెప్తూ ‘ఓవర్సీస్ లో పర్లేదు, బాగానే వచ్చింది , కానీ అనుకున్నంత వసూళ్లు రాలేదు. ఇది ఒక కేసు స్టడీ గానే భావిస్తున్నాము. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ, ఓవర్సీస్ లో అనుకున్నంత వసూళ్లు రాలేదంటే కచ్చితంగా కేసు స్టడీ నే. ఇప్పటి నుండి బిజినెస్ లెక్కలు ఓవర్సీస్ లో మారుతాయి. నార్త్ లో ఒక సినిమాని ఆడియన్స్ గట్టిగా పట్టుకుంటారు , ఒకసారి పట్టుకోరు. వాస్తవానికి పెద్ది ని అక్కడి ఆడియన్స్ పట్టుకోవాల్సిన సినిమా. ఇప్పటి వరకు 40 కోట్ల గ్రాస్ అక్కడి నుండి వచ్చింది . ఇంకో వారం థియేట్రికల్ రన్ అక్కడ ఉంటుందని ఆశిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
Overseas Market Needs Correction #PEDDI is a CASE STUDY!!
ఏంటో మరి అన్నీ Correct గా ఉన్నా కూడా అనుకున్నంత కలెక్షన్ అయితే రాలేదు…” pic.twitter.com/XDVK0ykDgy
— Movies4u Official (@Movies4u_Officl) June 14, 2026

