Tirumala: తిరుమలలో అన్నదానం చేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చవుతుందో తెలుసా?

తిరుమల కొండ భక్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారికి ఉచితంగానే భోజనం పెడుతారు. ప్రధాన ఆలయం సమీపంలో ఉన్న తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ప్రతిరోజూ అన్నదానం చేస్తుంటారు.

Written By: Chai Muchhata, Updated On : October 26, 2023 2:28 pm

Tirumala

Follow us on

Tirumala: కలియుగ దైవంగా పేర్కొంటున్న శ్రీవారి సన్నిధి తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రత్యేక రోజుల్లో అయితే మాడవీధులు నిండిపోతాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు దేశంలోని వారే కాకుండా వివిధ దేశాల నుంచి తరలి వస్తుంటారు. ఈ తరుణంలో భక్తులు తలనీలాలతో పాటు కానుకలను సమర్పిస్తుంటారు. తమ స్థాయికి మించి కోట్ల రూపాయల వరకు విరాళాలు ఇస్తుంటారు. ఈ క్రమంలో కొంత మంది తిరుమలలో అన్నదానం చేయాలని భావిస్తారు. తిరుమలలో నిత్యం అన్నదానం కొనసాగుతూ ఉంటుంది. ఈ అన్నదానానికి విరాళం ఇవ్వాలని అనుకుంటారు. ఒక్కరోజు అన్నదానం చేయాలంటే ఎన్ని లక్షలు చెల్లించాలో తెలిస్తే షాక్ అవుతారు.

తిరుమల కొండ భక్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారికి ఉచితంగానే భోజనం పెడుతారు. ప్రధాన ఆలయం సమీపంలో ఉన్న తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ప్రతిరోజూ అన్నదానం చేస్తుంటారు. ఇందులో ప్రతిరోజూ 60 నుంచి 70 వేల మంది భోజనం చేస్తుంటారు. ఈ భవనంతో పాటు కాంప్లెక్స్, పీఏసి 2 లో కూడా అన్నదానం చేస్తుంటారు. అలాగే రాంభగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం పీఎసి 1 వద్ద కూడా అన్న ప్రసాద వితరణ జరగుతూ ఉంటుంది.

తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారికి తమకు తోచిన విధంగా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. డబ్బు, నగల రూపంలో కొందరు హుండీలో వేయగా.. మరికొందరు ఆలయానికి నేరుగా విరాళాలు ఇస్తుంటారు. అన్నిదానాల్లోకెల్లా అన్నదానం మహాదానం అని చాలా మంది భావిస్తారు. అందుకే ఆలయాల్లో అన్నదానం చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో అన్నదానం చేయడం వల్ల మహా పుణ్యం వస్తుందని భావిస్తుంటారు.

అయితే ఇక్కడ అన్నదానం చేయడానికి భారీగానే విరాళం చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కరోజు అన్నదానం చేయాలనుకుంటే రూ.33 లక్షలుగా ఉండేది. ఇటీవల టీటీడీ రూ.38 లక్షలకు పెంచింది. అన్నదానం చేసేవారు తమ పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేర్ల మీద దానం చేయొచ్చు. ఈ విషయాన్ని ముందుగానే బోర్డువారికి తెలపడం ద్వారా వారు ఎవరైతే అన్నదానం చేస్తున్నారో వారి పేర్లు అన్నదానం చేసే ప్రదేశంతో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో డిస్ ప్లే చేస్తారు.

కేవలం అన్నదానం మాత్రమే కాకుండా అల్పాహారం కూడా దానం చేయొచ్చు. ఒక్కరోజూ అల్పాహారానికి రూ.8 లక్షలకుగా కేటాయించారు. అలాగే కేవలం మధ్యాహ్న భోజనానికి మాత్రమే విరాళం ఇవ్వదలుచుకుంటే రూ.15 లక్షలు చెల్లించాలి. ఇలా ఏ విధంగానైనా అన్నదానానికి విరాళం ఇవ్వాలనుకుంటే భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అన్నదానానికి నిత్యం విరాళాలు వస్తూనే ఉంటాయి. కొందరు విరాళం ఇవ్వడానికి ప్రత్యేక రోజులను ముందే బుక్ చేసుకుంటారు.