spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Netizens fire on Roja: డీఎంకే మాటాస్.. రోజాపై నెటిజన్ల ఫైర్

Netizens fire on Roja: డీఎంకే మాటాస్.. రోజాపై నెటిజన్ల ఫైర్

Netizens fire on Roja: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా అక్కడక్కడ ఫలితాలు నమోదు అవుతున్నాయి. తమిళనాడులో ఆశ్చర్యకరంగా విజయ్ టీవీ కే పార్టీ ముందు వరుసలో ఉండడం విశేషం. అయితే ఎర్లీ ట్రెండ్స్ లో డీఎంకే ముందు వరుసలో ఉండగా.. ఇప్పుడు విజయ్ పార్టీ దూసుకుపోతోంది. తరువాత స్థానంలో నిలుస్తోంది అన్నా డిఎంకె. అధికార డిఎంకే మాత్రం మూడో స్థానానికి పరిమితం అవుతోంది. అయితే ఇదే ట్రెండ్స్ కొనసాగుతుందని ఊహించలేం కానీ.. తమిళనాడులో హంగ్ తప్పదని తేలిపోయింది. డీఎంకేకు ఈసారి ఛాన్స్ దక్కే అవకాశం లేదని స్పష్టం అవుతుంది. ఈ తరుణంలో అందరి దృష్టి ఏపీ మాజీమంత్రి ఆర్కే రోజాపై పడింది. ఆమె ప్రచారం చేయడం వల్లే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కష్టాల్లో పడిందన్న టాక్ సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఆర్కే రోజా ప్రచారం చేయడం వల్లే డీఎంకేకు ఈ పరిస్థితి వచ్చిందని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం రోజా ఎన్నికల ప్రచారం అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె వ్యతిరేకులు దుమ్మెత్తి పోస్తున్నారు.

డీఎంకేవైపే మొగ్గు..
వాస్తవానికి తమిళ నాడులో అధికార డిఎంకె రెండోసారి అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు ముందుగానే చెప్పాయి. పోలింగ్ వరకు పరిస్థితి అలానే ఉంది. పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా డిఎంకెకు అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే అనూహ్యంగా విజయ్ టీవీ కే పార్టీ పుంజుకుంది. ఆపై అన్న డీఎంకే కూడా సత్తా చాటింది. త్రిముఖ పోరులో వెనుకబడింది అధికార డిఎంకె. అయితే ఆ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉండవచ్చు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం మాజీ మంత్రి ఆర్కే రోజా వైరల్ అవుతున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆమె ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తూ స్టాలిన్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా వెళ్లారా? లేకుంటే తన వ్యక్తిగతంగా స్టాలిన్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో వెళ్లారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు డీఎంకే తమిళనాడులో ఓటమి అంచున ఉండడంతో రోజా ఎక్కడ అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.

అప్పట్లో ఆ ముద్ర..
వైసిపి మాజీమంత్రి రోజాపై ఐరన్ లెగ్ ముద్ర ఉంది. ఆమె గతంలో టిడిపిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ఆ పార్టీ రెండుసార్లు ఓడిపోయింది. ఆ రెండుసార్లు కూడా ఆమె పోటీ చేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓడిపోయింది. అందుకే ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర బలంగా చాటుకుంది. 2019లో మాత్రం ఆమె గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పటితో ఐరన్ లెగ్ ముద్ర పోయింది. కానీ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల పుణ్యమా అని మళ్లీ ట్రోల్స్ కు గురవుతున్నారు రోజా. డీఎంకే విజయ బాటలో ఉండగా ఆమె ప్రచారం తోనే ఓటమి ఎదురైందని ఏపీ నెటిజెన్లు తెగ ఫైర్ అవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version