Divvala Madhuri: ఇటీవల దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. గత కొద్ది రోజులుగా తన ప్రేయసి దివ్వెల మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వ్యాపారాన్ని సొంతంగానే ప్రమోట్ చేసుకొని విస్తరించే పనిలో ఉన్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు. అయితే ఇటీవల శ్రీకాకుళంలో అడుగుపెట్టిన ఆయన ధర్మాన, కింజరాపు కుటుంబాలను టార్గెట్ చేసుకున్నారు. తద్వారా తన సొంత సామాజిక వర్గం ఏకతాటిపైకి రావాలని కోరుతున్నారు. దువ్వాడ రాజకీయాల్లో బిజీగా ఉండగా.. ఆయన ప్రేయసి మాత్రం వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. మహిళలతో కలిసి పొలం పనుల్లో పాలుపంచుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: కూలీ ‘సాంగ్ లోని మోనికా’ ఎవరో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే మెంటలే?
* మాధురి చాలా యాక్టివ్..
దివ్వెల మాధురి( divyala Madhuri ) సొంత గ్రామం టెక్కలి. డాన్స్ మాస్టర్ గా సూపరిచితురాలు. ఎంతోమందికి కూచిపూడి, భరతనాట్యం నేర్పించారు. సేవా కార్యక్రమాల్లో సైతం పాల్గొనేవారు. మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ కు దగ్గర అయ్యారు. గత ఏడాదిగా వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందో తెలియంది కాదు. గత కొద్దిరోజులుగా ఈ జంట వ్యాపారాలపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగరానికి పరిమితం అయింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు ఆ ఇద్దరూ.
* మహిళలతో పొలం పనులు..
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంటకు రీల్స్ చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే వారు వ్యాపారానికి సంబంధించిన ప్రకటనలు కూడా సొంతంగానే రూపొందించుకుంటున్నారు. సోషల్ మీడియాలో( social media) చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో దమ్ములతో పాటు ఉబాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మాధురి మహిళలతో వరి నాట్లు వేయడం కనిపించింది. అందుకు సంబంధించిన వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివ్వెల మాధురి కొత్త అవతారం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
