https://oktelugu.com/

Ram Gopal Varma : అప్పుడు థర్డ్ డిగ్రీ .. ఇప్పుడు భయం లేదట.. ఆర్జీవి మాటలకు అర్ధాలే వేరులే!

కొందరు తెలివిగా మాట్లాడతామని భావిస్తారు.తాము చెప్పిందే వేదమని వాదిస్తారు. ఇటువంటి వ్యక్తుల్లో ఆర్జీవి ఒకరు. ఒకవైపు కోర్టుల వద్ద భయం ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం తనకు భయం లేదని చెబుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 27, 2024 / 11:51 AM IST

    Ram Gopal Varma

    Follow us on

    Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మలో ఆ టెంపరితనం తగ్గలేదు.అయితే తాను భయపడడం లేదని..వణికిపోవడం లేదని చెబుతున్నారు ఆర్జీవి. కానీ ఆయన భయపడకపోతే ఎందుకు కనిపించడం లేదు?ఎందుకు అదృశ్యమయ్యారు?పోలీసులకు తప్పించుకుంటూ ఎందుకు తిరుగుతున్నారు?రామ్ గోపాల్ వర్మ క్రియేటివ్ దర్శకుడు.ఆయనకు భారతీయ చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉంది. కానీ అంతకుమించి వివాదాస్పదమయ్యారు ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి..నేరుగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా..సోషల్ మీడియా ద్వారా వైసీపీకి బలమైన మద్దతు దారుడుగా నిలిచారు. ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చే సినిమాలను తీశారు. అందుకే వైసిపి ప్రత్యర్థులకు ఆర్జీవి ప్రత్యర్థిగా మారిపోయారు.

    * ఏపీ పోలీసుల గాలింపు
    గత రెండు రోజులుగా రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ఎలాగైనా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ ఆయన ఆచూకీ దొరకలేదు.తమిళనాడులో షూటింగ్ జరుగుతుందని అక్కడకు వెళ్లారు.కానీ అక్కడ కూడా ఆర్జీవి కనిపించలేదు.ఈ తరుణంలో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. లాజిక్ ప్రశ్నలు వేశారు. తాను వణికి పోవడం లేదని చెప్పుకొచ్చారు. తాను అరెస్ట్ అవుతానని భావించిన వారికి ఈ వీడియో డిసప్పాయింట్ చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు.

    * ఎవరి మనోభావాలంట
    ఎప్పుడో ఏడాది కిందట తాను సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే ఇప్పుడు స్పందించడం ఏంటని ప్రశ్నించారు ఆర్జీవి. తన పోస్టింగ్లతో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని నిలదీశారు. తాను పోస్టులు ఒకరిపై పెడితే.. ఇంకొకరి మనోభావాలు దెబ్బ తినడం ఏమిటని వ్యంగ్యంగా మాట్లాడారు. ఒకేసారి రాష్ట్రం నలుమూలల వ్యక్తుల మనోభావాలు దెబ్బ తినగలవా అంటూఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే భయపడను అన్న ఆర్జీవి.. తన బెయిల్ పిటిషన్ విషయంలో మాత్రం థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని మాత్రం చెప్పుకొచ్చారు. అది భయమే కదా రామ్ గోపాల్ వర్మ. అంటే రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ధైర్యంగా ఉంటారు. యాక్షన్ లోకి వచ్చేసరికి మాత్రం భయపడతారు అన్నమాట.