Attack On Jagan: జగన్ పై గులకరాయి కేసులో దుర్గారావును ఇరికించాలని చూశారా? తద్వారా బోండా ఉమా పై పట్టు బిగించాలని ప్రయత్నం చేశారా? అంటే ఈ కేసులో అరెస్ట్ అయిన దుర్గారావు అవుననే సమాధానం చెబుతున్నాడు. గత నాలుగు రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్న దుర్గారావు బయటపడ్డాడు. ఈ సందర్భంగా తనకు పోలీసుల నుంచి ఎదురైన పరిణామాలను వివరించాడు. సతీష్ ను భయపెట్టిన పోలీసులు రాయి వేసినట్లు చెప్పించారని.. అలాగే తనను కూడా భయపెట్టాలని చూశారని.. తాను తప్పు చేయకపోవడంతో గట్టిగా నిలబడ్డానని.. దీంతో ఏం చేయలేక పోలీసులు ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించి విడిచి పెట్టారని దుర్గారావు చెబుతున్నాడు. దీంతో ఇది ఒక వైరల్ అంశంగా మారిపోయింది.
కొద్దిరోజుల కిందట విజయవాడ బస్సు యాత్రలో ఉన్న జగన్ పై గులకరాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. సింగ్ నగర్ పాఠశాల సమీపంలో దూసుకొచ్చిన ఒక రాయి జగన్ ను గీసుకుంటూ వెళ్లి మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ రావుకు తగిలింది. అప్పటినుంచి రచ్చ నడుస్తూనే ఉంది. ముందుగా ఈ ఘటనను బాధ్యుడును చేస్తూసతీష్ అనే మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అటు తరువాత ఆ కుర్రాడితో బోండా ఉమా అనుచరుడు, టిడిపి నేత వేముల దుర్గారావు చేయించాడని అనుమానిస్తూ అరెస్టు చేశారు.దీంతో బొండా ఉమా అరెస్ట్ తప్పదని ప్రచారం జరిగింది. అయితే అరెస్టు చేసిన నాలుగు రోజుల అనంతరం.. దుర్గారావును పోలీసులు వదిలేశారు. అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందని దుర్గారావు ఇప్పుడు చెబుతున్నాడు.
నాలుగు రోజుల కిందట పోలీసులు దుర్గారావు అరెస్టు చేశారు. వన్ టౌన్ లోని సిసిఎస్ కు తరలించారు. రోడ్ షో లో ఉన్న జగన్ పై రాయి ఎందుకు వేసావ్ అని తొలుతా ప్రశ్నించారు. తరువాత ఎందుకు రాయి వేయించావంటూ గట్టిగానే అడిగారు. అయితే ఈ ఘటనతో తనకు సంబంధం లేదని.. తనకు సంబంధం ఉన్నట్లు రుజువులు చూపాలని గట్టిగానే తాను అడిగినట్లు దుర్గారావు చెబుతున్నాడు. దీనిపై పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపు ధోరణితో మాట్లాడార ని.. పదేపదే బోండా ఉమా పేరును ప్రస్తావించారని దుర్గారావు చెబుతున్నాడు. బోండా ఉమా నీ వెనుక ఉండడంతో నువ్వే చేయించావట కదా అని పోలీసు ఉన్నతాధికారులు ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశాడు. నేను చేయనప్పుడు ఆయన నా వెనుక ఎందుకు ఉంటారని గట్టిగా సమాధానం ఇచ్చినట్లు కూడా చెప్పుకొస్తున్నాడు. అయితే చివరిగా దుర్గారావు తో ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకోవడంతో ఆందోళన చెందుతున్నాడు. అయితే దుర్గారావు అరెస్టు తర్వాత బోండా ఉమాను అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగకుండానే దుర్గారావును విడిచిపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడితో ఈ కేసు క్లోజ్ చేస్తారా? లేకుంటే అరెస్టులు ఉంటాయా? అన్నది తెలియాల్సి ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Did you see that durga rao should be implicated in the case of attack on jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com