Dharmana Prasad Rao latest news: ఆ వైసీపీ సీనియర్ జనసేనలో చేరుతారా? కుమారుడి భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకోనున్నారా? వైయస్సార్ కాంగ్రెస్ ఏమంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నారా? భవిష్యత్తు అంచనాకు వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ? అంటే ఏపీలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ). ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఏమంత యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. గత కొద్ది రోజులుగా ఊగిసలాటలో ఉన్నారు. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: YS Jagan : మీ సేవలు చాలు.. మాజీ మంత్రికి తేల్చి చెప్పిన జగన్!
కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం
కాంగ్రెస్ పార్టీలో( Congress Party) సుదీర్ఘకాలం పనిచేశారు ధర్మాన ప్రసాదరావు. 1989 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. చిన్న వయసులోనే మంత్రి పదవి అందుకున్నారు. అటు తరువాత 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కీలక మంత్రి పదవి అందుకున్నారు. 2014 వరకు పదేళ్ల పాటు ఉమ్మడి ఏపీలో మంత్రి పదవిలో కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయగా దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున మూడుసార్లు పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓ సాధారణ అభ్యర్థిని పెట్టగా.. ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 52 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
జిల్లా కేంద్రంలో కష్టం
జిల్లా కేంద్రం శ్రీకాకుళం( Srikakulam ) నియోజకవర్గంలో సంక్లిష్ట రాజకీయ పరిస్థితులు ఉంటాయి. అక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరమని ధర్మాన ప్రసాదరావు భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కుమార్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నించారు. జగన్ నిరాకరించడంతో అయిష్టంగానే పోటీ చేశారు. కానీ దారుణ పరాజయం ఎదురయింది. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
Also Read: Jagan Quash Petition: వైసీపీలో టెన్షన్.. కోర్టుకు జగన్!
జనసేన నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్
అయితే ఇప్పుడు జనసేన( janasena ) నాయకత్వం నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ప్రచారం సాగుతోంది. కుమార్ రెడ్డితో సహా ఆయన జనసేనలోకి వెళ్తారని టాక్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ధర్మాన ప్రసాదరావు పెద్దరికానికి గౌరవం లభించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా ధర్మాన ప్రసాదరావు కుమారుడికి ఏదో ఒకచోట సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ధర్మాన ప్రసాదరావు పార్టీ మారితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో నూకలు చెల్లినట్టే. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ ఉన్నారు. ఆయన మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.