https://oktelugu.com/

Nara Lokesh: కాణిపాకంలో భక్తుడికి అసౌకర్యం.. గంటల వ్యవధిలో స్పందించిన నారా లోకేష్!*

మంత్రి నారా లోకేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ భక్తుడికి ఆలయంలో ఎదురైన ఇబ్బందిని గుర్తించారు. గంటల వ్యవధిలో పరిష్కార మార్గం చూపించారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 23, 2024 / 12:37 PM IST

    Nara Lokesh

    Follow us on

    Nara Lokesh: ఏపీ క్యాబినెట్ లో మంత్రి లోకేష్ దూకుడుగా ఉంటారు. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వచ్చే సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపుతున్నారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాదర్బార్లు నిర్వహించి రికార్డు సృష్టించారు. నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రత్యక్షంగా తనను కలిసి అందించిన వినతులు, ఫిర్యాదులనే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చే సమస్యలను కూడా నారా లోకేష్ అంతే వేగంగా పరిష్కరిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతోంది. అటు పార్టీ శ్రేణులు సైతం తమ అభిప్రాయాలను లోకేష్ తో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు లోకేష్. తాజాగా కాణిపాకం ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ మురుగుదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన ఘటనపై ఓ నెటిజన్ నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై నారా లోకేష్ కూడా అంతే వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారు. సమస్యకు పరిష్కార మార్గం చూపించారు.

    * ఫోటోలు దిగేందుకు లంచం
    కాణిపాకం వినాయక స్వామి ఆలయం ఉంది. ఈ గుడికి అనుసంధానంగా మురుగుదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. కాణిపాకం వినాయకుడి ఆలయానికి వచ్చే భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ నిర్మాణంతో పాటు పరిసరాలను చూసి.. మణికంఠేశ్వర స్వామి ఆలయం వద్ద ఫోటోలు దిగాలనుకుంటారు. విశాఖ నుంచి వచ్చిన ఓ భక్తుడు కూడా ఇలాగే ఫోటోలు దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. ఫోటోలు దిగడానికి వీల్లేదని.. ఫోటోలు తీయాలంటే తమకు డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ఆ యువకుడు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో ఉంచాడు. ఆలయానికి వచ్చిన మరి కొంతమంది భక్తులు కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేశారు. గుడి వద్ద ఫోటోలు దిగాలంటే డబ్బులు అడుగుతున్నారని మండిపడ్డారు.

    * దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రకటన
    అయితే ఈ సమస్యను ఓ నెటిజన్ నేరుగా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.ఆలయం వద్ద ఫోటోలు దిగాలంటే డబ్బులు అడుగుతున్నారని లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. లోకేష్ అన్న ఒకసారి సమస్యలు చూడన్నా.. దయచేసి చర్యలు తీసుకోండి అన్నా అంటూ వీడియో కూడా షేర్ చేశారు ఓ నెటిజన్.దీనిపై అంతే వేగంగా స్పందించారు మంత్రి లోకేష్.వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. అక్కడ ఎలాంటి ఫోటోలైన తీసుకోవచ్చని ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు దేవాదాయ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ చొరవ పై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభినందనలు తెలుపుతున్నారు.