Devi Sri Prasad : తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కు ( Telugu music director Devi Sri Prasad ) ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ నిర్వహించనున్న మ్యూజికల్ నైట్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 19న విశాఖలో మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కయ్యపాలెం పూర్తి స్టేడియం విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన టిక్కెట్లు కూడా అమ్ముడైపోయాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు తాజాగా అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. వేలాదిమంది అభిమానులు వస్తారని.. తగిన భద్రత లేదని పోలీసులు తెలిపారట. కేవలం భద్రతా కారణాల దృష్ట్యా విశాఖ పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి రద్దు చేశారు. దీంతో దేవిశ్రీప్రసాద్ కు షాక్ తగిలినట్లు అయ్యింది.
Also Read : విశాఖ జోన్ గెజిట్ కు ఒడిశా అడ్డంకి!
* ఇటీవల ప్రమాదం..
ఇటీవల స్పోర్ట్స్ క్లబ్ లోని వాటర్ వరల్డ్ లో( water world ) ఓ బాలుడు చనిపోయాడు. దీంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఈవెంట్ కు వేలాదిమంది అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో భద్రతా కారణాలను గమనించిన తర్వాత అనుమతి నిరాకరించారు. అయితే ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు దాదాపు అమ్ముడైపోయాయి. ఇప్పుడు పోలీసులు అనుమతి రద్దు చేయడంతో అభిమానులు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అయితే ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అనుమతి నిరాకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని ప్రచారం కూడా నడుస్తోంది. అందుకు సంబంధించి పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
* ప్రధాన మార్గం ఒకటే..
దేవి శ్రీ ప్రసాద్ ఈవెంట్ జరిగే స్టేడియం, వేవ్ పూల్ వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ రెండూ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. అక్కడ ఫన్ గేమ్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్నో వరల్డ్ కూడా ఉన్నాయి. స్టేడియం మైదానానికి మిగతా వాటితో సంబంధం లేదు. కానీ ప్రధాన మార్గం మాత్రం ఒక్కటే. దాదాపు పదివేల మంది అభిమానులు ఈ కార్యక్రమానికి వస్తారని ఒక అంచనా. అందుకే జీవీఎంసీ అధికారులు, పోలీసులు స్టేడియంలో సందర్శించారు. స్టేడియంలోకి వెళ్లే మార్గాలను పరిశీలించారు. భారీగా జనం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించారు. ప్రస్తుతం స్టేడియంలో ఉన్న వసతులు సరిపోవని పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అందుకే అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. అయితే నిర్వాహకులు మాత్రం ప్రత్యేక విన్నపాలు చేస్తున్నారు.
* అన్ని ఏర్పాట్లు పూర్తి..
దాదాపు ఈవెంట్ కు( event ) సంబంధించి టిక్కెట్లు ఆన్లైన్లో అమ్ముడైపోయాయి. అదే సమయంలో నిర్వాహకులు సైతం ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకే తమ అభ్యర్థనను పరిశీలించాలని వారు పోలీసులను కోరారు. అయితే భద్రత చర్యలతో పాటు పార్కింగ్ కు సంబంధించి కీలక సూచనలు చేశారు పోలీస్ శాఖ అధికారులు. వాటిని నిర్వాహకులు పాటిస్తే అనుమతి గురించి ఆలోచిస్తామని చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు పోలీసులు వేచిచూసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నిర్వాహకులు రాజకీయ ప్రముఖులను ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. షరతులతో కూడిన అనుమతులు వస్తాయని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
Also Read : ఐకానిక్ టవర్లతో అమరావతికి గుర్తింపు.. ఒక్కోదానికి ఎంతో తెలుసా?