Amaravati Iconic Towers: అమరావతి రాజధాని( Amaravathi capital ) నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టనుంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉంది. అయితే తొలి పది నెలలు నిధుల సమీకరణ చేసింది ప్రభుత్వం. కొలిక్కి రావడంతో ఇప్పుడు పనుల ఉన్న ప్రారంభానికి శ్రీకారం చుట్టనుంది. మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. 2028 నాటికి పనులు పూర్తిచేసి.. 2029 ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా అమరావతిని ప్రపంచానికి తలమానికంగా నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.
Also Read: ఏపీ లిక్కర్ స్కాం.. సాయిరెడ్డి గుట్టు.. మిధున్ రెడ్డికి ఉచ్చు!
* అమరావతి స్థాయి చెప్పేందుకు..
అమరావతి స్థాయిని చాటి చెప్పేందుకు ఐకానిక్ భవనాల( iconic buildings ) నిర్మాణానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 14న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఐకానిక్ టవర్లను నిర్మించేందుకు ఆమోదముద్ర వేశారు. అయితే అక్కడకు 24 గంటల వ్యవధిలోనే పనులు ప్రారంభించడం విశేషం. ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి కార్యాచరణ ప్రకటించారు. కీలకమైన సచివాలయం, హై కోర్ట్, ఉన్నతాధికారుల కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణాలకు సిఆర్డిఏ టెండర్లను పిలిచింది. సచివాలయానికి నాలుగు టవర్లు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కార్యాలయాలకి ఒక టవర్ కేటాయించారు. వాటికి సంబంధించిన టెండర్లను ఆహ్వానించారు. ఈ రెండు టెండర్ల షీల్డ్ బిడ్లను వచ్చేనెల 1న తెరవనున్నారు.
* భారీగా ఖర్చు..
అయితే ఈ టవర్ల నిర్మాణానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. హెచ్ ఓ డి టవర్ ను ( HOD Tower ) నిర్మాణానికి రూ.1126 కోట్లు, సచివాలయం 1, 2 టవర్ల కోసం రూ.1897 కోట్లు, సచివాలయం 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.1664 కోట్లు… మొత్తంగా ఐదు టవర్ల నిర్మాణానికి రూ.4,668 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి బహుళ అంతస్తులు నిర్మించనున్నారు. ఉన్నతాధికారులు ఉండే హెచ్వోడి టవర్ను 45 అంతస్తులతో.. సచివాలయానికి సంబంధించిన నాలుగు టవర్లను ఒక్కొక్కటి 40 అంతస్తులతో నిర్మిస్తారు. వీటి నిర్మాణానికి రెండున్నర ఏళ్ల గొడుగు విధించారు. అటు ఇటుగా మరో మూడేళ్లలో ఈ టవర్లు అందుబాటులోకి రానున్నాయి అన్నమాట.
* టెండర్లు ఖరారు అయిన వెంటనే..
మే 1న టెండర్లు ఖరారు అవుతాయి. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అది మొదలు పనులు పట్టాలెక్కే విధంగా సిఆర్డిఏ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇప్పటికే అమరావతికి నిధుల సమీకరణ బాగానే చేశారు. తొలి 10 నెలలు నిధుల సమీకరణకు కేటాయించారు. దాదాపు 40 వేల కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించగలిగారు. అయితే అమరావతికి గుర్తింపుగా ఐకానిక్ టవర్లు నిలవనున్నాయి. అందుకే వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది చంద్రబాబు సర్కార్.