Davos Investment Summit: దావోస్ లో( davos ) ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని దేశాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం హాజరైంది. అయితే ఈసారి మన దేశం నుంచి దాదాపు పది రాష్ట్రాలు తమ ప్రత్యేక పెవిలియన్లు ఏర్పాటు చేశాయి. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇండియా నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తమ బృందాలతో అక్కడకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక మంత్రులు ఈ అంతర్జాతీయ వేదికపై తమ రాష్ట్రాల అనుకూలతలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు.
* ఆ పారిశ్రామిక సంస్థలు సైతం..
సాధారణంగా చాలా పరిశ్రమలకు సంబంధించి ఇండియా( India) వచ్చేందుకు ఇష్టపడవు. అసలు ఇండియా వైపు చూడని చాలా పరిశ్రమలు ఉన్నాయి. అటువంటి సంస్థలకు సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రాల ప్రతినిధులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యాపార విస్తరణకు తమ రాష్ట్రం అనుకూలం అంటే తమ రాష్ట్రం అనుకూలమని పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఇండియాలో మారిన పరిస్థితులను చూసి పారిశ్రామికవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. వారిలో ఆలోచన రేకెత్తించే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ఇవ్వగలుగుతున్నారు. సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రతి రాష్ట్రం తనదైన ప్రత్యేకత చాటుకుంటూ.. ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖిగా చర్చలు జరుపుతున్నాయి.
* ఆహ్లాదకరమైన పోటీ..
అయితే మునుపెన్నడూ లేని విధంగా దావోస్ ప్రపంచ పెట్టుబడుల సదస్సులో భారత భాగస్వామ్యం పెరిగింది. రాష్ట్రాల మధ్య ఆహ్లాదకరమైన పోటీ ఏర్పడింది. ఒక రాష్ట్రం కంటే మరో రాష్ట్రం మెరుగైన రాయితీలతో పాటు మౌలిక సదుపాయాలతో కూడిన పారదర్శకమైన పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. అయితే మెజారిటీ పెట్టుబడులు ఇండియా దక్కించుకునేలా ఉంది. రాష్ట్రాలు వేరైనా మన దేశం ఒక్కటే కదా. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ సిస్టం వల్ల భారత గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారే అవకాశం ఉంది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పది పెవిలియన్లు ఏర్పాటు చేశారు. అవి పక్క పక్కనే ఉండడం వల్ల విదేశీ పెట్టుబడుదారులకు ఆకర్షించగలుగుతున్నాయి. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, లాజిస్టిక్స్ రంగాల్లో మన రాష్ట్రాలు చూపుతున్న తెగింపును చూసి ప్రపంచం సైతం విష్ణు పోతోంది. అయితే పెట్టుబడుల సదస్సులో ఏపీ టీం ప్రత్యేకత చూపుతోంది. గత ఏడాది కాలంలో పారిశ్రామిక ప్రతిపాదనల్లో దేశంలో పావు వంతు పెట్టుబడులు ఏపీ వైపు వెళ్ళిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటు అవుతోంది. ఇది కూడా దావోస్ ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ప్రత్యేక ప్రస్తావనగా ఉంది. ఏపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉంది.