Nara Lokesh: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లింది. గత రెండు రోజులుగా బిజీగా గడుపుతోంది సీఎం చంద్రబాబు బృందం. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆర్ఎంజెడ్ సంస్థ ముందుకొచ్చింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సు ఫోరం సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ ఈ విషయాన్ని ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ చర్చలు జరపడంతో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖ తో పాటు రాయలసీమలో పరిశ్రమలను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు అయితే లక్ష ఉద్యోగాలకు అవకాశం కలిగినట్టే.
* విశాఖ కాపులుప్పాడలో..
దావోస్( davos ) పెట్టుబడుల సదస్సుకు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో మంత్రి నారా లోకేష్ సైతం ఉన్నారు. అయితే మంత్రి నారా లోకేష్ ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండాతో చర్చలు జరిపారు. ఈ చర్చలు సక్సెస్ కావడంతో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖలోని కాపులుప్పాడ ఫేస్ వన్ ఐటీ పార్కులో జిసిసి పార్క్ ఏర్పాటు చేయనుంది. 50 ఎకరాలలో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు విశాఖలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు. దశలవారీగా ఈ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నారు. ఇందుకోసం 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు.
* రాయలసీమలో లాజిస్టిక్ పార్క్.. రాయలసీమలో( Rayalaseema ) సైతం ఆర్ఎంజెడ్ గ్రూపు లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. టేకులోడు వద్ద సుమారు 1000 ఎకరాల్లో ఈ లాజిస్టిక్ పార్కు అభివృద్ధి చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తే.. అందుబాటులోకి వస్తే లక్ష ఉద్యోగాలకు సంబంధించి మార్గం సుగమం కానుంది. మరోవైపు ఆర్ఎంజెడ్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన తరుణంలో.. మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
At #Davos2026, pleased to announce a landmark $10 billion strategic infrastructure partnership between Andhra Pradesh and RMZ Group. The partnership will deliver a 10 million sq. ft. Global Capability Centre Park and a 1 GW hyperscale data centre cluster in Visakhapatnam,… pic.twitter.com/67eLt9d04G
— Lokesh Nara (@naralokesh) January 20, 2026