Davos Investment Summit: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. పాలకులకు విశాల హృదయం ఉండాలి. రాష్ట్రానికి ఏదో చేయాలన్న కలిసి ఉండాలి. ఇప్పుడు కూటమి పెద్దల్లో అదే కనిపిస్తోంది. వైసిపి హయాంలో అదే మైనస్ గా మారింది. దావోస్ లో ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి ప్రభుత్వ అధినేతలతో పాటు అధికారుల బృందాలు హాజరయ్యాయి. మన రాష్ట్రం నుంచి సీఎం చంద్రబాబుతో కూడిన బృందం ఒకటి వెళ్ళింది. భారత్లో పది రాష్ట్రాలకు సంబంధించి పెవిలియన్లు ఏర్పాటు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు బృందం దావోస్ వెళ్లడం ఇది రెండోసారి. అయితే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండగా.. ఒక్కసారి మాత్రమే ఆయన దావోస్ పర్యటనకు వెళ్లారు. విహారయాత్ర చేసుకుని మధ్యలో రెండు రోజులు పాటు సదస్సుకు హాజరయ్యారు.
* ఏదో మొహమాటానికి వెళ్లినట్టు..
అయితే ఇటువంటి పెట్టుబడుల సదస్సుకు వెళ్లే సమయంలో పక్కా వ్యూహం, ప్రణాళికతోనే వెళ్లాలి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏదో మొహమాటానికి వెళ్లినట్లు కనిపించారు. ఓ సమావేశంలో మోడరేటర్ అడిగిన ప్రశ్న అర్థం కాక.. జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇట్స్ లే లేంగ్తీ క్వశ్చన్ అంటూ తప్పించుకున్నారు. అప్పట్లో పరువు పోయినంత పని అయ్యింది. బహుశా ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరు కాలేదు. అప్పట్లో దీనిపైనే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి.
* ట్రోల్స్ కు గురైన గుడివాడ అమర్నాథ్
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా ఉండేవారు గుడివాడ అమర్నాథ్. దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తే.. చలి ఎక్కువని కవర్ చేసుకొని నవ్వుల పాలయ్యారు. కానీ ఇప్పుడు చంద్రబాబు టీం దావోస్ లో ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరై.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతుంటే.. తిరిగ్గా ఏపీలో కూర్చుని విమర్శలు చేస్తున్నారు. మళ్లీ నవ్వుల పాలు అవుతున్నారు. సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు బృందం దావోస్ పర్యటనలో ఉండగా.. గుడివాడ అమర్నాథ్ రంగంలోకి దిగారు. దావోస్ పర్యటన కేవలం డబ్బుల దండగ అన్నట్టు మాట్లాడారు. అందుకే ఇప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి.
* తన వైఫల్యాలను గుర్తుచేస్తూ..
అయితే అనవసరంగా తన వైఫల్యాలను గుర్తు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ సంక్షేమం గురించి మాట్లాడితే ఓకే. కానీ పెట్టుబడుల గురించి మాట్లాడితే మాత్రం ఆ పార్టీ పరువు పోవడం ఖాయం. అప్పట్లో ఒక్కసారి దావోస్ పర్యటనకు వెళ్ళింది అప్పటి సీఎం జగన్ బృందం. ఖాళీగా ఉన్న స్టాళ్లలో కూర్చుని బిక్క మొహాలు వేసుకున్న ఫోటోలు.. ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాయని చెబుతున్న బినామీ పరిశ్రమలతోనే అప్పట్లో ఒప్పందాలు చేసుకున్నారు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పైగా ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్ను ప్రయోగించి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే విమర్శలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ విమర్శలు చివరకు ఆ పార్టీకి చేటు తెచ్చి పెడుతున్నాయి.