Current Bill: కరెంట్ బిల్లులకి కొత్త కష్టం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలు అనుసరించి ఈ నిర్ణయం జరిగింది. జూలై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు బిల్లుల చెల్లింపు సేవలు నిలిపివేసాయి.

Written By: Dharma, Updated On : July 3, 2024 3:22 pm

Current Bill

Follow us on

Current Bill: ఏపీ ప్రజలకు కాస్త అసౌకర్యమైన వార్త. కరెంటు బిల్లులు ఈసారి ఫోన్ పే ద్వారా చేయడం జరగదు. డిస్కమ్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విద్యుత్ బిల్లులను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సహా యూపీఐ యాప్ ల ద్వారా చెల్లింపులు కుదరవు. జూలై నుంచి యూపీఐ యాప్ ల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు సేవలను యాప్ లు నిలిపివేశాయి. ఇకపై వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి విద్యుత్ డిస్కమ్ లకు సంబంధించి యాప్ ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలు అనుసరించి ఈ నిర్ణయం జరిగింది. జూలై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు బిల్లుల చెల్లింపు సేవలు నిలిపివేసాయి. విద్యుత్ వినియోగదారులు ప్రతినెల బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కంల వెబ్ సైట్, మొబైల్ యాప్ ను వినియోగించక తప్పదు. ఇక్కడే చిన్న విసులుబాటు కల్పించారు. వినియోగదారులు డిస్కంల యాప్/ వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్ లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డ్స్ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది.

ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెంట్రల్ పవర్ యాప్ ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఈస్టర్న్ పవర్ యాప్ ను, ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైయస్సార్ నెల్లూరు జిల్లాల పరిధిలోని వినియోగదారులు సౌతర్న్ పవర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి ద్వారా చెల్లింపులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మార్పును గమనించాలని కోరుతున్నారు.