https://oktelugu.com/

Solar Eclipse : మార్చి 29న సూర్యగ్రహణం.. ఈ ప్రభావం భారత్ పై ఎలా ఉండనుంది?

Solar Eclipse : ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుడు భూమి ఒకే వరుసలో ఉండవు. అయితే భూమికి సూర్యుడికి మధ్యల ఒక్కోసారి చంద్రుడు అడ్డం వస్తాడు. దీంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

Written By: , Updated On : March 28, 2025 / 01:39 PM IST
Solar Eclipse

Solar Eclipse

Follow us on

Solar Eclipse : ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుడు భూమి ఒకే వరుసలో ఉండవు. అయితే భూమికి సూర్యుడికి మధ్యల ఒక్కోసారి చంద్రుడు అడ్డం వస్తాడు. దీంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2025 ఏడాదిలో మార్చి 29న మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇదే నెలలో 14న చంద్రగ్రహణం ఏర్పడింది. 15 రోజుల తేడాతోనే సూర్యగ్రహణం ఏర్పడడంతో దీనిపై ఆసక్తి చర్చ సాగుతుంది. అయితే గ్రహణం సందర్భంగా భారత్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయాలు మూసివేయడం.. గ్రహణం సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకపోవడం వంటివి చేస్తారు. మరి ఈ చంద్రగ్రహణం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించాలి? ఏం చేయాలి? అసలు భారత్లో సూర్యగ్రహణం ప్రభావం ఎలా ఉంటుంది? ఆ వివరాల్లోకి వెళితే..

Also Read : సూర్యగ్రహణం కృత్రిమంగా ఏర్పడుతుందా? ఇది భూమి, చంద్రుని కదలికకు ఎంత తేడాను కలిగిస్తుంది?

భారత కాలమానం ప్రకారం 2025 మార్చి 29న మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగిస్తుంది. అలాగే న్యూయార్కులో ఉదయం 6.35 గంటల నుంచి 7.12 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. అంటే సూర్యగ్రహణం అమెరికాతో పాటు కెనడా ఐరోపా ఆఫ్రికా తో పాటు కొన్ని పశ్చిమ దేశాల్లో కనిపిస్తుంది. భారత్లో ఉదయమే సూర్యగ్రహణం ఏర్పడుతున్నందున.. ఎక్కువగా ప్రభావం ఉండకపోవచ్చు అని కొందరు పండితులు చెబుతున్నారు. అందువల్ల భారత్లో సూతక కాలం పనిచేయదని చెబుతున్నారు. ఈ సందర్భంగా భారత్ లో ఉండేవారు నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.

అయితే సూర్యగ్రహణం సమయంలో భారత్లో ఉండేవారు గాయత్రి జపం చేయడం మంచిదని కొందరు పండితులు చెబుతున్నారు. అలాగే గురువుల నుండి పొందిన శిష్యులు మంత్రపదేశాన్ని చేయాలని అంటున్నారు. గ్రహణం సమయంలో ధ్యానం చేయడం మంచిదని అంటున్నారు.

అయితే ఇదే రోజు మరో అద్భుతం జరగనుంది. ఈరోజు ఆరు గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీనివల్ల ప్రపంచంలో అనేక మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ప్రకృతిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని అందరూ జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఇక మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడడంతో కుంభ రాశి నుంచి మీన రాశిలోకి శని ప్రవేశించనున్నాడు. దీంతో ధనస్సు మీనా కర్కాటక రాశి వారికి ప్రభావం ఉండనుంది. అలాగే మిగతా రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ ప్రభావం 2007 జూన్ 3 వరకు ఉంటుంది. అయితే ప్రభావం ఉన్న రాశుల వారు శని పూజ చేయడం వల్ల కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది. దాదాపు శని 100 సంవత్సరాల తర్వాత మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందువల్ల శని మీన రాశిలోకి ప్రభావం వల్ల కొన్ని రాశులపై ఉండే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

అయితే పశ్చిమ దేశాల్లో ఉండేవారు సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ పాక్షికంగా కనిపించిన కొందరు సూర్యగ్రహణాన్ని చూడాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే ఉదయం సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతున్నందున సూర్యగ్రహణంను అనుకున్నట్లుగా చూడలేమని కొందరు చెబుతున్నారు.

Also Read : అక్టోబర్ 2న సూర్యగ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా? ఎలాంటి నియమాలు పాటించాలి?