CPI Narayan Comments on Pawan Divorce : ఆ మధ్య సనాతన ధర్మం మీద తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశాడు. అది పవన్ కళ్యాణ్ కు తీవ్ర అగ్రహాన్ని కలిగించింది. వెంటనే దానికి కౌంటర్ వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్. అంతేకాదు ఇటీవల తమిళనాడు వెళ్ళినప్పుడు కూడా ఉదయ నిధిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తమిళనాడులో పలు సుప్రసిద్ధ ఆలయాలను తన కుమారుడితో కలిసి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
Also Read : కలిసి ఉంటే కలదు సుఖం.. లోకేష్ పై పవన్ అలా!
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. అయితే నారాయణ చేసిన వ్యాఖ్యలను జనసేన నాయకులు తప్పు పట్టారు. పలు మాధ్యమాలలో సిపిఐ నారాయణను లక్ష్యంగా చేసుకుంటూ వారు విమర్శలు చేశారు. దీంతో ఇన్నాళ్లపాటు నిశ్శబ్దంగా ఉన్న సిపిఐ నారాయణ.. తొలిసారి స్వీయ వీడియో ద్వారా బయటికి వచ్చారు. అంతేకాదు సనాతన ధర్మంపై.. పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ” సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను వెంటనే అరెస్టు చేయాలి.. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది. అరాచకమైనది. దానిని ఎవరు సమర్థించిన సరే అరెస్టు చేయాల్సిందే. సనాతన ధర్మంలో విడాకులు అనేవి లేవు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారినే శిక్షించాలి.. సనాతన ధర్మంలో భర్త ఎలా ఉన్నా సరే భార్యాభరించాలి. భార్య ఎలా ఉన్నా సరే భర్త తట్టుకొని ఉండాలి. కానీ భార్య తప్పు చేసిందని.. భర్త అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడ్డాడని పేర్కొంటూ విడాకులు ఇవ్వడం సరికాదు. అసలు సనాతన ధర్మంలో విడాకులు అనేవి లేవు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ రెండు వివాహాలు చేసుకుని విడాకులు ఎలా ఇచ్చారు.. ఇప్పుడు మూడవ వివాహ బంధంలో ఎలా కొనసాగుతున్నారు.. ఇది ఎంతవరకు సమంజసం” అంటూ నారాయణ ప్రశ్నించారు.
నారాయణ చేసిన వ్యాఖ్యలను జనసేన నేతలు తప్పుపడుతున్నారు. ” ఈ మధ్య ప్రతి రాజకీయ నాయకుడు ఫేమస్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి వ్యవహార శైలికి ఎవరైనా సరే ముగింపు పలకాల్సిందే. నారాయణ ఏదో వ్యాఖ్యలు చేస్తుంటారు.. గతంలో జాతిపిత జయంతి రోజున చికెన్ తిన్న అతను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ” జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. తమ నాయకుడి పై నారాయణ అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.