Cows: పైన అరటి గెలలు.. లోపల పదుల సంఖ్యలో పశువులు. అచ్చం పుష్ప సినిమాలో ఎర్రచందనం తరలించినట్టు.. మూగ జీవాలను కబేళాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. ముఖ్యంగా ఏపీ( Andhra Pradesh) నుంచి పశువుల అక్రమ రవాణా తెలంగాణకు భారీగా జరుగుతోంది. కంటైనర్లలో, ఇరుకు లారీల్లో పశువులను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే పోలీసు నిఘా ఉండడంతో సరికొత్త ఆలోచన చేశారు. వ్యాన్ లో మీద అరటి గెలలు వేసి.. కింద పశువులను ఉంచి తరలిస్తున్నారు. అయితే ఇవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి అని తేలడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకుంటోంది. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. హిందూ ధర్మ పరిరక్షణ ఏది అంటూ ప్రశ్నిస్తోంది.
Also Read: వైసీపీలో నేతల నోర్లు తెరుస్తున్నాయే!
* పట్టుబడిన పశువులు..
హైదరాబాదులోని చౌటుప్పల్( chautuppal ) వద్ద డీసీఎంఎస్ వ్యాన్ తో భారీగా పశువులు పట్టుబడ్డాయి. ముందస్తు సమాచారం అందుకున్న భజరంగ్ దళ్, గో సంరక్షణ సమితి సంయుక్తంగా ఈ వ్యాన్ ను పట్టుకున్నాయి. అయితే మీద అరటి గెలలు కనిపిస్తున్నాయి. అరటి గెలల మాటున పశువులు తరలించడం గుర్తించారు. పైన ఉన్న అరటి గెలలు తొలగించగా.. కిందలో భారీగా పశువులు ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువగా లేగ దూడలు కనిపిస్తున్నాయి. కబేలాలకు తరలించేందుకే ఇలా తీసుకొస్తున్నట్లు తేలింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి ఈ పశువులను తరలించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిని ఎవరు ధ్రువీకరించలేదు.
* అదే పనిగా వైసిపి ప్రచారం..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ సోషల్ మీడియా దీనిని ప్రచార అస్త్రంగా వాడుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గట్టిగానే వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తరచూ గో సేవ చేస్తుంటారు. దానిని గుర్తు చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. హిందూ ధర్మం కోసం పామున్నామని చెప్పుకుంటున్న నేతలు ఉన్న ఏపీ నుంచి.. ఇలా పశువులను తరలిస్తుంటే వారు ఏం చేస్తున్నట్టు అని తెలంగాణ నేతలు నిలదీస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే గత కొంతకాలంగా ఏపీ నుంచి భారీగా పశువులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణతోపాటు హైదరాబాద్కు భారీగా తరలిస్తున్నారు. కంటైనర్లతో పాటు రకరకాల రూపాల్లో ఈ తరలింపు సాగుతోంది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉంది.
డీసీఎం గారి నియోజకవర్గం నుంచి డీసీఎంలో ఆవులు అక్రమ రవాణా
పైన అరటి గెలలు, కింద ఆవులు..పుష్ప సినిమా తరహాలో పిఠాపురం నుంచి గోవుల తరలింపు
పక్కా సమాచారంతో భజరంగ్ దళ్, గోరక్ష సమితి, చౌటుప్పల్ దగ్గర డీసీఎంలో తరలిస్తున్న ఆవులను పట్టుకున్న తెలంగాణ పోలీసులు
హిందూ ధర్మం కోసం… pic.twitter.com/i8GDBtgX5q
— greatandhra (@greatandhranews) May 19, 2025