YSR Congress party
YSR Congress : వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో జగన్మోహన్ రెడ్డి ది సోలో పెర్ఫార్మెన్స్. ఆ పార్టీకి కర్త, కర్మ,క్రియ ఆయనే. కుటుంబ సభ్యులకు సైతం ఆ పార్టీలో చోటు లేదని స్పష్టమైంది. సోదరితో పాటు తల్లి సైతం పార్టీకి దూరమయ్యారు. తన ఆర్థిక ప్రగతికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదిగా నిలబడి పని చేసిన విజయసాయిరెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి మాటకు తిరుగులేదు. ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం ఏ సీనియర్ చేయలేదు. ఆయన ముందు కూడా కూర్చోవడానికి వీలులేని పరిస్థితి ఉందని ఒక ప్రచారం ఉంది. అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు కొందరు సీనియర్లు. తిరుగుబాటు అనేకంటే.. జగన్మోహన్ రెడ్డికి ఉచిత సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. పరాజయం ఎంతటి వారినైనా లోకువ చేస్తుంది అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అది స్పష్టం అవుతోంది.
Also Read : జగన్మోహన్ రెడ్డి అరెస్ట్.. ముహూర్తం ఫిక్స్!
* అప్పట్లో మాట్లాడే సాహసం చేయలే..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో చాలామంది సీనియర్లను కాదని జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు. ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ), ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నేతలను పక్కన పెట్టారు. తన సొంత మార్క్ ఉండేలా క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు కూడా సీనియర్లు నోరు తెరవ లేకపోయారు. ఏదైనా ప్రభుత్వ పథకం ప్రారంభించే సమయంలో.. బటన్ నొక్కే సమయంలో సైతం తాను ఒక్కడే కుర్చీలో కూర్చునేవారు. తన తండ్రి సమకాలీకులైన మంత్రులకు సైతం కుర్చీలు ఏర్పాటు చేసే వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరిని లెక్క చేసేవారు కాదు. అలాగని అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే సాహసం ఎవరు చేయలేకపోయేవారు.
* వైసీపీ ఓటమికి ఎన్నెన్నో కారణాలు
అయితే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. సీనియర్లు ఒక్కొక్కరు నోరు తెరుస్తున్నారు. బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి 100 కారణాలు అని ఆ మధ్యనే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేసినా ప్రజలు తిరస్కరించాలని.. చంద్రబాబు మభ్యపెట్టి హామీలు ఇచ్చారని జగన్ పదేపదే చెబుతున్నారు. కానీ బొత్స లాంటి నేతలు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 100 కారణాలు ఉన్నాయని చెప్పుకున్నారు. ఆ 100 కారణాలు ఏంటి అన్నది బహిరంగ రహస్యమే. అది అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన దేనని తెలుస్తోంది. పార్టీలో సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం ఒక కారణమని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అదే సీనియర్లు ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి మరి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలను తప్పుపడుతున్నారు. ఆయన మంచివాడు అంటూనే తీసుకున్న నిర్ణయాలు తప్పని మాత్రం చెబుతున్నారు.
* మీడియా ముందుకు సీనియర్లు..
కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి( Prasad Reddy) జగన్ మంచితనం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎప్పుడూ దేవుడు చూసుకుంటాడని అన్నారని.. కానీ జగన్ కు దేవుడుకు మధ్య చంద్రబాబు ఉన్న విషయాన్ని మరిచిపోయారని.. చంద్రబాబు కుటిల రాజకీయ వ్యూహకర్తతో పోల్చిన రాచమల్లు.. జగన్మోహన్ రెడ్డి అతి మంచి వాడు అని చెప్పుకొచ్చారు. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కామెంట్స్ చేశారు. బిజెపితో కలిసి పోటీ చేసి ఉంటే అధికారంలోకి వచ్చే వాళ్ళమని తేల్చి చెప్పారు. అయితే ఇదే సీనియర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చేందుకు సాహసించలేదు. ఇప్పుడు మాత్రం నోరు తెరిచి మంచివాడు అంటూనే జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Ysr congress ysrcp leaders speaking out