Motivation: గొప్ప గొప్ప వాళ్లంతా విజయాలు సాధించినప్పుడు.. పొంగిపోలేదు. దానికంటే ముందు ఓటములు ఎదురైనప్పుడు కుంగిపోలేదు. కాకపోతే ఆ ఓటమి నేర్పిన పాఠాల నుంచి చాలా నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న దానిని అమల్లో పెట్టారు కాబట్టి వారు విజయాలు సాధించారు. ఆ విజయాల వల్లే వారు ప్రపంచానికి సరికొత్తగా కనిపించారు. ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులుగా నిలబడ్డారు. అందుకే విజయం అనేది ఒక చరిత్ర అయితే.. ఓటమి అనేది ఒక పాఠం. ఆ పాఠం నుంచి మనం ఎంత నేర్చుకుంటే.. అంత సులభంగా గెలుపును సాధించగలుగుతాం. తద్వారా విజేతలుగా ఆవిర్భవించగలుగుతాం.
Also Read: వరుస సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ..ఈమెను ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..
గెలుపు దక్కాలంటే ముందు ఓడిపోవాలి. ఓడిపోయిన తర్వాత ఆ బాధ మనకు తెలుస్తుంది. గెలవాలని కసి పెరుగుతుంది. చివరికి మన ప్రయాణాన్ని గెలుపు దిశగా సాగిస్తుంది. పాండవులు జూదంలో ఓడిపోయారు. కురుక్షేత్రంలో గెలిచారు. చివరికి అత్యంత బలవంతమైన తమ సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నారు. ఒకవేళ వారు జూదంలో కనుక ఓడిపోయి ఉంటే రాజ్యాన్ని సాధించేవారు కాదు. విరాట మహారాజు దగ్గర మారువేషంలో ఉండేవారు కాదు. కురుక్షేత్రంలో కౌరవులపై పై చేయి సాధించేవారు కాదు. కానీ ఒక్క ఓటమి వారికి ఎన్నో పాఠాలు నేర్పింది. చివరికి వారిని విజేతులను చేసింది. అత్యంత బలవంతుడైన ఆంజనేయుడు.. సీత జాడ కోసం తిరగని చోటు లేదు. వెతకని ప్రదేశం లేదు. చివరికి రాముడు అప్పజెప్పిన బాధ్యత నెరవేర్చలేని అనుకున్నాడు. ఓడిపోయాను అని భావించాడు. చివరికి ఎక్కడో తప్పు చేస్తున్నానని అనుకున్నాడు. దాని నుంచి త్వరగానే బయటపడ్డాడు. ఆ తర్వాత లంకిణి కాపలాగా ఉన్న లంకలో సీత జాడ ఉందని తెలుసుకున్నాడు. చివరికి ఆ విషయాన్ని రాముడికి చెప్పాడు. తద్వారా రాముడు రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మను అయోధ్యకు తీసుకెళ్లాడు.. ఇలా దేవత మూర్తులే ఓటమి బాట పట్టారు. ఆ ఓటముల నుంచి గెలుపులను సాధించారు.
ఓటమి అనేది కసిని పెంపొందిస్తుంది. వినయాన్ని కలిగిస్తుంది. సాధించాలి అనే తపనను మరింత పెంచుతుంది. ఆ సమయంలో మన లక్ష్యం విజయం మీద మాత్రమే ఉంటుంది. ఇతర విషయాల వైపు ఏ మాత్రం మళ్ళించదు. మన లక్ష్యం అనేది ఒకే తీరుగా ఉన్నప్పుడు గెలుపు అనేది ఎంత దూరంలో ఉండదు. ఒకసారి వైఫల్యం కావచ్చు. మరోసారి ఓటమి ఎదురు కావచ్చు. ఇంకోసారి పరాభవం చవి చూడవచ్చు. కానీ అంతిమంగా గెలుపు అనేది దక్కుతూనే ఉంటుంది.. అయితే పడే కష్టంలో.. ఎదుర్కొనే ప్రతిఘటనలో నిజాయితీ ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుంది. అడ్డగోలుగా.. అడ్డదారుల్లో.. గెలవాలి అంటే మాత్రం కుదరదు. ఒకవేళ అలా గెలిచిన గెలుపు ఎల్లకాలం నిలబడదు.. అద్భుతమైన విలుకారుడైన అర్జునుడు.. విల్లు ఎక్కుపెట్టి.. బాణంతో పిట్టను నేరుగా కొట్టాడు. మిగతా వారంతా తమ లక్ష్యాన్ని ఇతర మార్గాల వైపు మళ్ళిస్తే.. అర్జునుడు మాత్రం నేరుగా పిట్టను చూసి కొట్టాడు. అందుకే మనకు ఓటమి ఎదురైనప్పుడు.. మన దృష్టి మొత్తం టార్గెట్ మీద మాత్రమే ఉండాలి. దారి మళ్ళితే.. ఇక అంతే సంగతులు. స్థూలంగా చెప్పేది ఒకటే.. ఓడిపోవాలి. ఆ ఓటమిని గెలుపుకు సోపానంగా మార్చుకోవాలి.. అలా లభించిన గెలుపు ద్వారా ప్రపంచానికి సరికొత్తగా కనిపించాలి.