Phone Security Settings: ప్రస్తుత కాలంలో మొబైల్ లేకుండా ఏ పని ముందుకు సాగే ఆకాశం లేదు. విద్యార్థుల నుంచి పెద్దపెద్ద వ్యాపారాలు చేసేవారు మొబైల్ తోనే ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే మొబైల్ ను కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కొన్ని యాప్స్ ను ప్రైవసీగా ఉంచుకోవాలని చూస్తారు. అయితే ఇలాంటి సమయంలో ఎవరైనా తెలిసినవారు మొబైల్ ఇవ్వమని అడుగుతారు. అప్పుడు వారు యాప్స్ ను ఓపెన్ చేయడం ద్వారా కొన్ని విషయాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వారికి కావలసిన సమాచారం కాకుండా మిగతా యాప్స్ ఓపెన్ కాకుండా చేయాలంటే మొబైల్ లోని ఒక ఆప్షన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Also Read: ప్రతి ఒక్క ఫోన్ లో ఇలా చేసి.. Lifetime పెంచుకోండి.. ఏం చేయాలంటే?
నేటి కాలంలో చాలా మంది యువత తమ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే ఫోన్ లాక్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ను వారికి తెలియకుండా చేయాలని అనుకుంటారు. కానీ ఫోన్ లాక్ యాప్షన్ తో అనేక ఇబ్బందులు ఉన్నట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. అయితే కొన్ని యాప్స్ ఇతరులు చూడకుండా ఉండాలంటే వాటికి సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసం మొబైల్ లో ఏం చేయాలంటే?
మొబైల్ లోని Settings అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ pin అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేయగానే app pin అని డిస్ప్లే అవుతుంది. ఈ యాప్ పిన్ ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా కొన్ని రకాల ముఖ్యమైన యాప్స్ ను ఇతరులు చూడకుండా చేయవచ్చు. ఈ యాప్ ఇన్ ఎనేబుల్ చేసిన తర్వాత.. ఏదైతే యాప్ ఇతరుల చూడకుండా ఉండాలంటే.. దానిపై ప్రెస్ చేయగానే పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎనేబుల్ చేయడం ద్వారా అది ఇతరులు ఎవరు ఓపెన్ చేయడానికి ఆస్కారం ఉండదు. వారికి కావాల్సిన యాప్ ను మాత్రమే ఉపయోగించుకుంటారు.
Also Read: వాట్సాప్ కు భారీ షాక్.. ఆ సర్వేలో ఏం తేలిందంటే..?
అయితే ఈ ఆప్షన్ అవసరం లేదని అనుకుంటే కూడా డిసేబుల్ చేసుకోవచ్చు. మొబైల్ లోని రీసెట్, బ్యాక్ అనే బటన్స్ రెండూ ఒకసారి ప్రెస్ చేయడం వల్ల యాప్ పిన్ అనే ఆప్షన్ డిసేబుల్ అవుతుంది. ఇలా అవసరం ఉన్నప్పుడు ఎనేబుల్ చేసుకొని అవసరం లేనప్పుడు డిసేబుల్ చేసుకొని అవకాశం ఉంది. ఈ యాప్ ఇన్ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులు చూడకుండా చేసుకోవచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లలు లేదా ఇతరులు మొబైల్ అడిగినా వారికి ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే వారికి కావాల్సిన యాప్ను మాత్రమే ఓపెన్ చేసుకుంటారు. మిగతా వాటికి సెక్యూరిటీగా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది మొబైల్ లోనే ఉండడంతో దీనివల్ల యాప్స్ కు ఎలాంటి సమస్య ఉండదు.