Jagan: వైసీపీ శ్రేణులు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. దారుణంగా ఓటమి చవిచూసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే రాజకీయ పార్టీలు అన్నాక గెలుపోటములు సహజం. దీనికి ఎవరు అతీతులు కాదు. కానీ ఇప్పుడు వైసీపీకి ఓటమి కాదు. ఆ పార్టీ అధినేత జగన్ కు ఓటమి. ఇక్కడ పార్టీని కాపాడుకోవడం కంటే తనపై వస్తున్న ఆరోపణలు, కేసులను ఎదుర్కోవడమే జగన్ కు టాస్క్ గా మిగిలింది. మూలికే నక్కపై తాటి పండు పడ్డ విధంగా.. పాత ని బాధతో ఉన్న జగన్ పై అదాని ముడుపుల కేసు పడింది. అది మొదలు ఆయన ఏపీ నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు. అక్కడే ఎక్కువగా గడుపుతున్నారు. సాధారణంగాతాడేపల్లి వస్తే పార్టీ కోసం వచ్చినట్టు. బెంగళూరు వెళ్తే తన కేసుల గురించి వెళ్లినట్టు అని వైసిపిలో ఒక ప్రచారం ఉంది. అయితే వైసిపి ఓడిపోయిన నాటి నుంచి ఆయన ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. తద్వారా పార్టీ తన వ్యక్తిగత పనులకి ఆయన ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతోంది.
* హడావిడిగా బెంగళూరుకు
కొద్ది రోజుల కిందట అదాని ముడుపుల వ్యవహారం బయటపడింది. అదే రోజున ఆయన హడావిడిగా బెంగళూరు వెళ్ళిపోయారు. ప్రతిరోజు తన అనుకూల మీడియాలో అదానితో ఎటువంటి డీల్ జరగలేదని.. కేవలం కేంద్రంతోనే ఒప్పందం చేసుకున్నామని అదేపనిగా ప్రసారం చేయించుకుంటున్నారు. సాక్షి పత్రికలో పేజీలకు పేజీలు రాయించుకుంటున్నారు. అయితే ఇలా మితిమీరిన రాతలు చూసి ప్రజలకు అసలు విషయం అర్థం అవుతోంది. అదే సమయంలో జగన్ బెంగళూరులో ఉండిపోవడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఈ ముడుపుల కేసు నుంచి బయటపడేందుకు జగన్ అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుంది.
* ఎలా బయటపడాలి
లంచం ఏయే రూపాల్లో వచ్చింది అనే దానిపై కేంద్రం వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం అదాని వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తే మాత్రం జగన్కు ఇక్కట్లు తప్పవు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అదాని దిగ్గజ పారిశ్రామికవేత్త కావడం, కేంద్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో జగన్ కాస్త రిలీఫ్ గా భావిస్తున్నారు. అయితే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భయపడుతున్నారు. ఒకవేళ కేంద్రం దర్యాప్తు చేయిస్తే ఎక్కడదొరికిపోతానన్న ఆందోళన జగన్లో కనిపిస్తోంది.అందుకే బెంగుళూరు కేంద్రంగా నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అదానీ ప్రతినిధులు సైతం టచ్లోకి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి అయితే జగన్ బెంగళూరులోనే రోజుల తరబడి ఉండిపోవడం వైసీపీలోనే ఒక రకమైన ప్రచారం నడుస్తోంది.