Corona Cases in AP : ప్రపంచంలో కరోనా( Corona ) కేసులు మళ్లీ మొదలయ్యాయి. రోజురోజుకు పెరుగుతుండడంతో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనాలో కేసుల వ్యాప్తి అధికంగా ఉంది. మనదేశంలో కూడా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అంతటా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. 2019, 2020లో కరోనా విపత్తు యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. అటు తరువాత అడపాదడపా కరోనా వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పటిలా ప్రభావం మాత్రం చూపలేదు. తాజాగా మరోసారి కరోనా కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
* ప్రపంచం అతలాకుతలం..
కరోనా మాట చెబితేనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎంతటి ప్రభావం చూపిందో తెలియనిది కాదు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇక ఆ ముప్పు తప్పినట్లే అనుకుంటున్నా సమయంలో ఇప్పుడు మరోసారి ఆందోళన మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. చాలా దేశాల్లో కేసుల వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) కూడా ఆందోళన మొదలైంది. ఏపీలో కరోనా కేసుల గురించి ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీలో కరోనా కేసులపై ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదని తెలిపింది. అయినా సరే అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read : ఏపీలో కరోనా విలయమే.. రోజుకు 13వేల కేసులు.. లక్ష దాటిన యాక్టివ్ కేసులు
* మనదేశంలో కూడా ప్రభావం..
మనదేశంలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 257 కరోనా కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయినా సరే ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు ఉంటే సమీపంలోని ఆసుపత్రికి సంప్రదించాలని సూచించింది. మరోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు కరోనా పై సమీక్షిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.
* సింగపూర్ లో విలయతాండవం..
మరోవైపు సింగపూర్లో( Singapore) కరోనా విలయతాండవం చేస్తోంది. ఏప్రిల్ చివరి వారంలో 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు 100 మంది ఆసుపత్రిలో చేరుతున్నారని… అయితే మునుపటిలా ఐసీయూ వరకు అవసరం లేకుండా తిరుగు ముఖం పడుతున్నారని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. థాయిలాండ్ లో సైతం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడం విశేషం. చైనాతో పాటు హాంగ్ కాంగ్ లో సైతం కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. అయితే సీజనల్ ప్రభావంతోనే కరోనా వ్యాప్తి చెందుతుందని.. దీనికి భయపడాల్సిన పని లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించడం విశేషం.