Redistribution Of Constituencies: ఏపీలో( Andhra Pradesh) నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనగణన ప్రారంభం కానుంది. దాంట్లోనే కుల గణన కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్రం దృష్టి పెట్టే అవకాశం ఉంది. సాధారణంగా అధికార పార్టీ తమకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంలో కొంతవరకు సక్సెస్ అవుతుంది. ప్రస్తుతం ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో కూటమికి అనుకూలంగా పునర్విభజన జరుగుతుందన్న టాక్ నడుస్తోంది. 2009లో చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగినట్లు వార్తలు వచ్చాయి. 2009లో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పునర్విభజన దోహద పడిందన్న టాక్ నడిచింది.
Also Read: రాజస్థాన్ అడవుల రాణి.. రణగర్జన నుంచి శాశ్వత నిద్ర వరకు
* విభజన హామీగా..
2014లో రాష్ట్ర విభజన( state divide ) జరిగింది. అప్పట్లో నవ్యాంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని విభజన హామీల్లో సైతం పొందుపరిచారు. అయితే జనగణనతో పాటు కుల గణన జరగకపోవడంతో నియోజకవర్గాల పునర్విభజన చేయలేకపోయారు. వాస్తవానికి 2011లో జనగణన జరిగింది. సరిగ్గా పదేళ్లకు అంటే 2021లో జనగణన జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా అప్పట్లో జనగణన జరగలేదు. ఇప్పుడు తాజాగా జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. 2026లో జన గణన పూర్తి చేసి.. వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించింది. అంటే 2029 నాటికి కొత్త నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి అన్నమాట.
* రిజర్వేషన్లలో మార్పులు
ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 25 పార్లమెంట్ స్థానాలు కొనసాగుతున్నాయి. పునర్విభజనతో 225 కు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. పార్లమెంటు సీట్లు( parliament seats ) సైతం పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే జనగణన తరువాతే దీనిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలను ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనతో ఆరు నుంచి 8 వరకు ఎంపీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు సైతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఎస్సీ రిజర్వు నియోజకవర్గాలు జనరల్ కానున్నాయి.
* ఎవరికివారుగా అన్వయం
అయితే నియోజకవర్గాల పునర్విభజన తమకు లాభం అంటే తమకు లాభం అని రాజకీయ పార్టీలు చెప్పుకుంటున్నాయి. అయితే అధికార పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగే అవకాశం ఉంది. దాదాపు 50 సీట్లు పెరగడంతో కూటమి పార్టీల మధ్య సర్దుబాటు ఆ స్థాయిలో ఉండనుంది. అటు విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆశావాహులకు అవకాశాలు ఇచ్చేందుకు ఒక అవకాశంగా భావిస్తోంది. అయితే అధికార పార్టీ కచ్చితంగా రాయలసీమ వంటి ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటుంది. సామాజికపరంగా పట్టున్న నియోజకవర్గాల్లో మార్పులకు ప్రయత్నిస్తుంది. 2009లో అలానే చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అటువంటి పరిస్థితి వస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.