Homeఆంధ్రప్రదేశ్‌చేతులెత్తేసిన సీఎం జగన్..అంతా వలంటీర్లదే బాధ్యత

చేతులెత్తేసిన సీఎం జగన్..అంతా వలంటీర్లదే బాధ్యత

CM Jagan : సీఎం జగన్ చేతులెత్తేశారు. పార్టీ కేడర్ కంటే తనకు వలంటీర్లే గట్టెక్కిస్తారని గట్టి నమ్మకం ఏర్పరచుకున్నారు. తనపై అసంతృప్తితో వెళ్లిపోయినా పర్వాలేదు.. నా వలంటీర్ల సైన్యం ఉంటే చాలన్న డిసైడ్ కి వచ్చేశారు. వలంటీర్లకు వందనం పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వేదికపై ప్రసంగించిన జగన్ అదే పనిగా వలంటీర్లను పొగుడుతూ పార్టీ కేడర్ ను తక్కువ చేసేలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. తాను ప్రారంభంలో వలంటీర్లను లీడర్లు చేస్తానని చెప్పానని.. ఇప్పుడు మీ స్థితి లీడర్ల మాదిరిగా ఉందా? లేదా? అంటూ వలంటీర్లనే గుర్తు చేసుకునేలా మాట్లాడారు.

వాస్తవానికి వలంటీరు వ్యవస్థపై వైసీపీ కేడర్ లోనే తీరని అసంతృప్తి ఉంది. ప్రజలు ఏ పని కావాలన్నా వలంటీర్లనే కలుస్తున్నారని.. తమను అస్సలు పట్టించుకోవడం లేదని.. అటువంటప్పుడు తాము ప్రజాప్రతినిధులుగా ఉండి ఏం లాభమని సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకూ ఒకటే వ్యధ. ఆ మధ్యన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణకుగాను వర్క్ షాపు నిర్వహించారు. నేను బటన్ నొక్కుతా.. మీరు ప్రజల వద్దకు వెళ్ళి చెప్పాలన్నప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ చేతులమీద పనులు కానప్పుడు ప్రజలు తమను నిలదీస్తున్నారని చెప్పడంతో అప్పటికప్పుడు గడపగడపకు నిధులు అంటూ ఎమ్మెల్యేలకు ఫండ్ కేటాయించాల్సి వచ్చింది.

వలంటీర్ల వ్యవస్థతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్న అపవాదు జగన్ సర్కారుపై ఉంది. జగన్ రాజకీయం కోసం తమ హక్కులను సైతం కాలరాశారంటూ స్థానిక సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు చెప్పులతో కొట్టుకున్న సందర్భాలున్నాయి. మంత్రులు గ్రామాల్లో పర్యటించినప్పుడు మీకు పథకాలు ఇస్తున్నది ఎవరో తెలుసా అని అడిగేటప్పుడు ప్రజలు చటుక్కున వలంటీర్ల పేరే చెబుతున్నారు. దీంతో ఖంగుతినడం వైసీపీ లీడర్ల వంతవుతుంది. ఇప్పుడు జగన్ చెబుతున్న లీడర్ల మాట అదేనన్న మాట. నాడు వలంటీర్లను లీడర్లను చేస్తానని చెప్పింది ఇందుకోసమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

వలంటీర్లు కేవలం ప్రభుత్వ వారధులే కాదు. ఇకపై పార్టీకి సేవలందిస్తారని అర్ధం వచ్చేలా సీఎం జగన్ వ్యాఖ్యానించడం విశేషం. మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని హామీ ఇచ్చారు. వలంటీర్ల నిర్వాకాల వల్లనే ఎక్కవ మంది ఓటర్లు వైసీపీకి దూరం అవుతున్నారన్న ప్రచారం ఉంది. అయినప్పటికీ వలంటీర్లనే నమ్ముకోవడం .. పార్టీ క్యాడర్ ను విస్మరించడం తన నెత్తి మీద తాను చేయి పెట్టుకున్నట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper
Exit mobile version