Laptop Speed Increase Tips: మన కంటే స్పీడ్ గా మన సిస్టం వర్క్ చేస్తేనే ఉత్సాహం ఉంటుంది. ఒక్కోసారి సిస్టం లేదా ల్యాప్ టాప్ పనితీరు స్లో గా మారుతుంది. ఒక్కో అప్లికేషన్ ఓపెన్ కావడానికి 15 నుంచి 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. దీంతో వేగవంతంగా పనిచేసేవాళ్లకు ఇది చికాకును కలిగిస్తుంది. అంతేకాకుండా సమయానుకూలంగా పనిచేసేవాళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా జరగడం వల్ల టెక్నీషియన్ చూపించి సమస్యను పరిష్కరించుకుంటాం. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.
సిస్టమ్ లేదా ల్యాప్ ను వాడినప్పుడు అనవసర అప్లికేషన్స్ ఇన్ స్టాల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా అవసరం లేనివి ఎన్నో ఉంటాయి. వీటితో అవసరం లేకున్నా బ్యాగ్రౌండ్ లో అవి రన్ అవుతూ ఉంటాయి. దీంతో సిస్టం స్లోగా మారే అవకాశం ఉంది. అందువల్ల అవసరం లేని యాప్స్ ను వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసేయండి. ఒక్కోసాసి కంప్యూటర్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా కొన్ని స్టార్టప్ లు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇలా ఆటోమేటిక్ గా ఓపెన్ కాకుండా సెట్టింగ్స్ లోకెళ్లి మార్చుకోండి. లేదంటే వీటితో మెమోరిపై లోడ్ పడుతుంది.
మనం చేసే వర్క్ కు సంబంధించిన ఫైల్స్ ను ఎక్కువగా హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకుంటాం. అయితే ఇది నిండిపోవడంతో సిస్టం స్లోగా మారుతుంది. ఈ సమయంలో మీకు అవసరమైన ఫైల్స్ ను ఉంచుకొని మిగతావి డెలిట్ చేయండి. లేదా సిడీలు, లేదా పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకోండి. మీరు చేసే వర్క్ ఇంకొంచెం స్పీడ్ అవ్వాలంటే ఇప్పుడున్న ర్యామ్ కు అదనంగా మరో ర్యామ్ ను జతపర్చండి. దీంతో వర్క్ ఫాస్ట్ గా చేసుకోవచ్చు.
సిస్టమ్ ఆన్ ఉన్నంత సేపు కొన్ని ఆటోమేటిక్ గా ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇవి అలాగే ఉండిపోతే మెమోరి ఎక్కువగా చూపిస్తుంది. వీటిని వెంటనే డెలిట్ చేయండి. డివైజ్ లో అనవసరపు ఫైల్స్ ను క్లీన్ చేయడానికి పలు అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని డౌన్లోడ్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి. ఇవి ఎక్కువగా ఫేక్ వే ఉన్నాయి. బ్రౌజింగ్ ఎక్కువగా చేసేవాళ్లు.. వర్క్ పూర్తయిన తరువాత హిస్టరీని క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్డ డివైజ్ స్పీడ్ పెరుగుతుంది.