CM Chandrababu: ఎన్నికలకు ముందు చంద్రబాబు( Chandrababu) నోటి నుంచి తరచూ ఒక మాట వచ్చేది. వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. అవసరం అయితే సంపదను సృష్టిస్తాం. అదే సంపదను ప్రజల కోసం ఖర్చు చేస్తాం. అంటూ చాలా రకాల ప్రకటనలు చేసేవారు చంద్రబాబు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. మరో నాలుగు నెలలు అయితే ఏడాది పాలన పూర్తవుతుంది. కానీ ఇంతవరకు సంక్షేమ పథకాల జాడలేదు. సంపద సృష్టి ప్రారంభం కాలేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కనుక సంక్షేమ పథకాలు అమలు చేయలేమన్న మాటను పదేపదే చెబుతున్నారు బాబు. అటు సంపద సృష్టి లేక.. ఇటు పథకాలు అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు.. ఆ నెపాన్ని జగన్ పై వేయడం కనిపిస్తోంది.
* గత ఐదేళ్లుగా పథకాలు అమలు
గత ఐదేళ్ల వైసిపి( YSR Congress ) పాలనలో సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి. రాజకీయాలకు అతీతంగా అమలు చేసి చూపించారు జగన్. అయితే నాడు సంక్షేమం మాటున రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో పెట్టారని.. దాని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయిందని చంద్రబాబు తాజాగా చెప్పడం ప్రారంభించారు. అయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణం సూపర్ సిక్స్ పథకాల అమలు ఉంటుందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం మాత్రం ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి.. ఇం దుకు జగన్మోహన్ రెడ్డి తీరే కారణం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. కొత్త తరహా ప్రచారం మొదలుపెట్టారు.
* మాజీ మంత్రి అంబటి సెటైర్
అయితే చంద్రబాబు తాజాగా సంక్షేమ పథకాలు( welfare schemes) అమలు చేయలేమని తేల్చి చెప్పారు. అయితే దానికి వెనుక వ్యూహమో.. వ్యూహాత్మకమో ఉందన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇది వైసీపీకి ప్రచార అస్త్రంగా మారింది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు దీనిపై స్పందించారు.’ సంపద సృష్టి లేదు.. సంపంగి పువ్వు లేదు’ అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పారని.. ఏడు నెలలు దాటిన సృష్టించలేకపోయారని.. కానీ జగన్మోహన్ రెడ్డి పై పడిపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అది చంద్రబాబుకు అలవాటైన విద్యగా అభివర్ణించారు. అయితే ఒక్క అంబటి కాదు.. వైసీపీ నేతలు అంతా ఇప్పుడు చంద్రబాబు సంక్షేమ పథకాల ప్రకటనపై మండిపడడం ప్రారంభించారు.
* వైసిపికి ప్రచార అస్త్రంగా చంద్రబాబు( Chandrababu) సంపద సృష్టి అన్నమాట మరోసారి వైరల్ అవుతోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర బృందం దావోస్ పర్యటనకు వెళ్ళింది. కానీ ఎటువంటి పెట్టుబడులు తేలేకపోయింది అంటూ విపక్షాలు ఆరోపించడం ప్రారంభించాయి. కానీ 30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ప్రభుత్వం చెబుతోంది. కేవలం ఎంవోయులతో పెట్టుబడులు రావని కూడా చెప్పుకొస్తోంది. 30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని.. త్వరలో ఆ పెట్టుబడులంతా రాష్ట్రానికి వస్తాయంటూ చెబుతోంది. అయితే సంపద సృష్టి అన్న చంద్రబాబు మాట ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా వైసీపీ పాలన ఉన్నట్టు ఆయన.. ఆర్థికంగా వెనుకబాటుతనంపై తరచూ మాట్లాడుతుండడం మాత్రం విమర్శల పాలవుతోంది. వైసీపీకి అస్త్రం అందించినట్టు అయ్యింది.