CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) భద్రత విషయంలో పోలీసు యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్ర దాడులు, పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర ప్రముఖులు, ప్రజల భద్రతపై పోలీసు యంత్రాంగం ఉన్నత స్థాయిలో సమీక్షించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబుకు భద్రత పెంచాలని నిర్ణయించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై గట్టి చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ తర్వాత రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ప్రజలు, సంస్థలు, ముఖ్యమైన వ్యక్తుల రక్షణ పై ఉన్నతాధికారులు సమీక్షించారు. డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర తో కలిసి భద్రతా చర్యలపై చర్చించారు.
Also Read : అమరావతి విషయంలో చంద్రబాబును భయపెడుతున్న ఆంధ్రజ్యోతి ఆర్కే!
* పక్కాగా భద్రతా నియమాలు..
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు యంత్రాంగం( police department) నిర్ణయించింది. భద్రతా నియమాలు పక్కాగా అమలు చేయాలని.. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని.. ఎక్కడ రాజీ పడవద్దు అన్నారు. భద్రతా నియమాలను పూర్తిగా పాటించాలని.. ఎటువంటి అలసత్వం కూడా వద్దన్నారు. సీఎం చంద్రబాబు ప్రజల్లోకి, బహిరంగ ప్రదేశాలకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు డిజిపి. సీఎం పర్యటనల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రత్యేక ఏర్పాట్లు ఎలా చేయాలి అన్నది ఎస్పీలకు వివరించారు. రాష్ట్రంలో భద్రతా చర్యల గురించి డిజిపి సీఎం చంద్రబాబుకు వివరించారు. అయితే తనకు భద్రత కల్పించే సమయంలో ప్రజలకు ఇబ్బంది పెట్టవద్దని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
* పాక్ పై దాడుల నేపథ్యంలో పహల్గాం( Pahalgam) ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు పై భారత్ మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సింధూర పేరుతో భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఈ దాడుల్లో 100 మంది వరకు మరణించారని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఘటన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు సీఎంలతో పాటు గవర్నర్లతో మాట్లాడారు. రాష్ట్రాలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రముఖులతోపాటు ప్రజల భద్రతపై పోలీస్ యంత్రాంగం ఫోకస్ పెట్టింది.
Also Read : అందుకే సింహాచలం వెళ్ళని సీఎం చంద్రబాబు!
* తీర ప్రాంత భద్రతపై దృష్టి..
మరోవైపు తీర ప్రాంత భద్రతపై( coastal area security ) సైతం ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుపతి జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా డొంకూర్ వరకు దాదాపు 1000 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో తీరంలో గస్తీని పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నావితో పాటుగా మెరైన్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా సాగర్ కవాచ్ నిర్వహించాలని.. తీరంలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తీరప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు. మొత్తానికి అయితే పాక్ తో యుద్ధం నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉంది.