Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu :  నాగబాబు, పిఠాపురం వర్మ ఓకే.. మిగతా ఆ నలుగురు ఎవరు?

CM Chandrababu :  నాగబాబు, పిఠాపురం వర్మ ఓకే.. మిగతా ఆ నలుగురు ఎవరు?

CM Chandrababu  ఏపీలో ( Andhra Pradesh) ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈనెల 20న ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమి 165 అసెంబ్లీ స్థానాల్లో పటిష్ట స్థితిలో ఉంది. దీంతో ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఆ పార్టీ దక్కించుకోనుంది. అయితే మెగా బ్రదర్ నాగబాబుకు ఒక పదవి ఖాయం అయ్యింది. మిగతా నాలుగు పదవులు టిడిపికి దక్కే అవకాశం ఉంది. కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు ప్రారంభం అయింది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఎంపిక అనేది ఉత్కంఠ రేపుతోంది.

* పిఠాపురం వర్మ కు ఛాన్స్
ప్రధానంగా పిఠాపురం వర్మ కు( Pithapuram Varma ) ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. అందుకే ఆయనకి ఈసారి అవకాశం ఇస్తారా? లేదా అన్నది చూడాలి. మరోవైపు పదవి విరమణ పొందిన వారు సైతం మరోసారి పదవులను కోరుతున్నారు. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు సైతం పదవి ఆశిస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం మైలవరం టికెట్ వదులుకున్నారు. ఆయనకు తప్పకుండా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయనకు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, పరుచూరి అశోక్ బాబు పోటీగా వస్తున్నారు. ఈ ముగ్గురు కమ్మ సామాజిక వర్గం నేతలు కావడంతో ఒకరికి ఛాన్స్ దక్కే పరిస్థితి ఉంది.

Also Read : విజయసాయిరెడ్డి యూ టర్న్.. జూన్ లో స్ట్రాంగ్ డెసిషన్.. చంద్రబాబు మాస్టర్ స్కెచ్!

* సామాజిక సమతూకం కష్టమే..
ఒకవేళ వర్మ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే.. అటు నాగబాబును ( Nagababu) చూసుకున్నా అగ్రవర్ణాల కిందకు వస్తారు. మిగతా పదవులు ఇతర వర్గాలకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు పదవులు ఆశిస్తున్నారు. దీంతో అగ్రవర్ణాలకు చెందిన దేవినేని ఉమా కు ఛాన్స్ దక్కకపోవచ్చు అన్నది ఒక అనుమానం. ఇక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే బుద్ధ వెంకన్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే సమయంలో మైనారిటీ నేతలు కే యం సైఫుల్ల, మహమ్మద్ నజీర్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

* వారు సైతం ఆశావహులుగా..
ఇంకోవైపు ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్న దువ్వారపు రామారావు( Duvvarapu Rama Rao) , బీటీ నాయుడు, పరుచూరి అశోక్ బాబు సైతం మరో ఛాన్స్ కోరుతున్నారు. ఈ ముగ్గురు కాకుండా బీసీ కోటాలో మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర, రెడ్డి సుబ్రహ్మణ్యం సైతం క్యూలో ఉన్నారు. మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏరాసు ప్రతాప్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి తదితరులు తమ పేర్లు పరిశీలించాలని కోరుతున్నారు. అయితే ఆశావహుల జాబితాతో కుస్తీ పడుతున్నారు చంద్రబాబు. అయితే ఎమ్మెల్సీ పదవుల భర్తీతో అలకలు, అసంతృప్తులు తప్పేలా లేవు.

Also Read : నాగబాబుకు ఎమ్మెల్సీ.. కేఏ పాల్ ఆగ్రహం.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular