CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఆరోగ్యంగా ఉంటారు. ఏడుపదుల వయసులో కూడా చలాకీగా కనిపిస్తారు. దానికి కారణం లేకపోలేదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు చంద్రబాబు. మితాహారంతో ఆరోగ్యాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటారు. అందుకే 70 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. యువకుడి మాదిరిగా పనిచేస్తుంటారు. ఉదయమే లేవడం.. అర్ధరాత్రి వరకు పని చేయడం అలవాటుగా మార్చుకున్న చంద్రబాబు.. తన ఆరోగ్యం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు. అందుకే ఎక్కువమంది చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఏంటి అని ఆరా తీసుకుంటారు. ఇటువంటి సమయంలో సీఎం చంద్రబాబు తన హెల్త్ సీక్రెట్ చెప్పేశారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.
Also Read: ప్రభుత్వ సంచలన నిర్ణయం!
* నిత్యం బిజీగా ఉన్నా..
సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా.. నవ్యాంధ్రప్రదేశ్ కు రెండుసార్లు సీఎంగా సేవలందించారు చంద్రబాబు. అంతకుమించి రాష్ట్రానికి ప్రతిపక్ష నేత హోదా లో ఉన్నారు. అయితే అధికారంలో ఉన్నా.. లేకపోయినా చంద్రబాబు ఎప్పుడు బిజీగా ఉంటారు. క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. ఆయనకు అలుపు అన్నది ఉండదు. ఆయనతో పరిగెత్తడం చాలా కష్టమని సహచర మంత్రులు చెబుతుంటారు. ఉన్నతాధికారులు ఉత్సాహంగా ఆయనతో కలిసి పని చేస్తుంటారు. అయితే చంద్రబాబు అంత చలాకీగా ఉండడానికి కారణం.. ఆయన నిత్యం డైట్ కంట్రోల్ లో ఉంటారు. తాజాగా ఓ సమావేశంలో తన హెల్త్ సీక్రెట్ చెప్పేశారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఆమ్లెట్ మాత్రమే తింటానని స్పష్టం చేశారు. ఆరోగ్యం కోసం మిల్లెట్లు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. సమతుల ఆహారం కోసం చిరుధాన్యాలు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటానని చంద్రబాబు వెల్లడించారు.
* తరచూ ఆరోగ్యం గురించి ప్రస్తావన
ఇటీవల ప్రజలకు ఆరోగ్య పరిస్థితుల గురించి.. తీసుకోవాల్సిన ఆహారం గురించి తరచూ చంద్రబాబు ప్రస్తావిస్తుంటారు. ఈ సమావేశంలో కూడా నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. కొన్ని ప్రాంతాల్లో రాగి, మరికొన్ని ప్రాంతాల్లో జొన్నలను ప్రజలు తినేవారు. ఎన్టీ రామారావు( NT Rama Rao) సీఎం అయ్యాక రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. అప్పటినుంచి అందరికీ అన్నం తినే అవకాశం లభించింది. పరువు ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడే అన్నం తినడం ప్రారంభించారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని.. బియ్యం అధికంగా తీసుకోవడం ద్వారా మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి ఆరోగ్యం మనం తినే తిండి, మన అలవాట్లు, జీవనశైలి పై ఆధారపడి ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, చేపలు, గుడ్లు వంటి ఆహారానికి ప్రాధాన్యత పెరిగిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.