HomeతెలంగాణTelangana : తెలంగాణలో పాత వాహనాలు ఉన్నవారికి షాక్..

Telangana : తెలంగాణలో పాత వాహనాలు ఉన్నవారికి షాక్..

Telangana : జీవితాంతం కష్టపడి డబ్బులు కూడా పెట్టుకుని.. లక్షలు పెట్టి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ వాహనాల్లో కొన్ని దొంగల పాలవుతున్నాయి. ఒకసారి ఏదైనా వాహనం దొంగిలించబడిందంటే తిరిగి దక్కించుకోవడం కష్టతరంగా మారింది. చాలామంది చోరులు వాహనాలను కొనుగోలు చేసిన తర్వాత వెంటనే నెంబర్ ప్లేట్లను మార్చేసి.. ముఖ్యమైన పార్కులను కూడా తీసేస్తున్నారు. అలా చేసి ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి గతంలో కొందరు సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోవుంది. 2025 సెప్టెంబర్ నుంచి ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఉండాలని నిర్ణయించింది. అయితే ఈ నెంబర్ ప్లేట్ను ఇంటికే తెచ్చుకునే అవకాశం ఉందా? అంటే కచ్చితంగా ఉంది. ఇందుకోసం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఎలాగంటే?

Also Read : తెలంగాణ ఆర్థిక సంక్షోభం.. హామీలు నెరవేర్చడం రేవంత్‌కి సవాల్‌!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019 కంటే ముందు వాహనాలు కొనుగోలు చేసుకున్న వారు High Security Registration Plate (HSRP) ను తప్పనిసరిగా ఉంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సెప్టెంబర్ 30 2025 గడువుగా నిర్ణయించింది. ఈ లోగా వాహనాలు ఉన్నవారు సెక్యూరిటీ ప్లేట్లు తప్పనిసరిగా మార్చుకోవాలని పేర్కొంది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ వల్ల దొంగతనాలను అరికట్టవచ్చని, అలాగే రహదారి భద్రత ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అయితే సాధారణంగా హాయ్ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ను మార్చుకోవాలంటే రేడియం సెంటర్ లోకి వెళ్లి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మార్చుకుంటే కనీసం రూ. 320 నుంచి రూ. 400 వరకు చార్జ్ అవుతుంది. అయితే కొందరు వీటిని నాణ్యమైనవిగా ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేరుగా రిజిస్ట్రేషన్ శాఖ నుంచే ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఇంటికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ద్వారా పై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఇంటికే వస్తుంది. అదెలా చేయాలంటే?

ముందుగా గూగుల్ లోకి వెళ్లి www.bookmy hsrp.com లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే దానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో వాహనదారుల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో కారు, ద్విచక్ర వాహనం, ఆటో, లారీ ఇలా ఏ వాహనమైన ఇందులో ఐ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ కోసం బుకింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డెలివరీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన తర్వాత ఇంటి అడ్రస్ కు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ వస్తుంది.

Also Read : శ్రీ ఆత్మసాక్షి సర్వే : కాంగ్రెస్ అవుట్ : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ దే అధికారం..

2019 సెప్టెంబర్ 30 తర్వాత ఈ నెంబర్ ప్లేట్ వాహనాలకు లేకపోతే పోలీసులు జరిమానా వేసి అవకాశముంది. ఈ జరిమానా భారీగా ఉండనుంది. అందువల్ల తెలంగాణలోని వాహనాలు ఉన్నవారు ఐ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరిగా మార్చుకోవాల్సి ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version