Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu Cycle Ride: చంద్రబాబులో అదే జోరు.. ఏకంగా మూడు కిలోమీటర్ల పాటు..!

CM Chandrababu Cycle Ride: చంద్రబాబులో అదే జోరు.. ఏకంగా మూడు కిలోమీటర్ల పాటు..!

CM Chandrababu Cycle Ride: చంద్రబాబులో ఇంకా జోష్ తగ్గలేదు. ఆయన వయస్సు పై రకరకాల ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం చాలా యాక్టివ్ గానే ఉంటారు. ఆరోగ్యపరంగా చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా ఫీట్ గా కూడా కనిపిస్తుంటారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారా? ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా? అన్నవారు ఉన్నారు. కానీ దీనిపై నిన్ననే తన సొంత నియోజకవర్గ కుప్పం నుంచి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రికార్డ్ స్థాయిలో మూడు కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కి తనలో ఉత్సాహం తగ్గలేదని నిరూపించుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 7 పదులు దాటుతోంది. 1978లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మధ్యలో 1983 లో ఓడిపోయారు. 1985లో పోటీ చేయలేదు. 1989 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఆరోగ్యం సహకరించదు అనేది ప్రత్యర్థుల వాదన. కానీ చంద్రబాబు మాత్రం తన ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఉంటారు. నిన్ననే ఏకంగా నాలుగు కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి తనలో ఫిట్ తగ్గలేదని గట్టి సంకేతాలు పంపగలిగారు.

* కుప్పం పర్యటన..
కుప్పం పర్యటనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారితలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 5555 ఈ సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. అందులో భాగంగా శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తుమ్సీలో ప్రజా వేదిక వరకు మూడు కిలోమీటర్లకు పైగా సీఎం చంద్రబాబు సైకిల్ తొక్కుతూ చేరుకున్నారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది. పసుపు రంగుతో కూడిన సైకిల్ తొక్కుతూ ఆయన ముందుకు సాగగా వేలాదిమంది వెంట అనుసరించారు.

* ప్రత్యేక దృష్టి..
మరోవైపు కుప్పంలో ఇటీవల సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తరచూ పర్యటిస్తూ వస్తున్నారు. కొద్ది నెలల కిందట శాంతిపురంలో సొంత ఇంటిని కూడా నిర్మించుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు కుప్పంకు తాజాగా వచ్చారు. అందులో భాగంగా చాలా రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ఏకంగా 5 వేలకు పైగా సైకిళ్లను ప్రదర్శనగా ఉంచి లబ్ధిదారులకు అందించడం విశేషం. చంద్రబాబు స్వయంగా సైకిల్ తొక్కడం అందరినీ ఆకట్టుకుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular