CM Chandrababu: జనాభా పెరుగుదల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) నిత్యం ఏదో ఒక వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దేశాభివృద్ధి జరగాలంటే దేశంలో జనాభా పెరగాలన్నది చంద్రబాబు ఉద్దేశం. ఈ క్రమంలోనే ఆయన అన్ని వేదికల వద్ద సంతానోత్పత్తి పెరగాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కష్టపడి నలుగురు పిల్లలను కన్నాడంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ అక్కడున్న వారిని నవ్వులు పుట్టించాయి. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* నలుగురు పిల్లల చదువుకు సాయం..
ఓ కార్యక్రమానికి గాను చంద్రబాబు అనంతపురం జిల్లాకు( Ananthapuram district ) వెళ్లారు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి నలుగురు సంతానం గురించి తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన చంద్రబాబు ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. ఒక్కో పిల్లాడి భవిష్యత్తు కోసం లక్ష రూపాయలు మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఆయన మాదిరిగానే అందరూ నలుగురు పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునిచ్చేసరికి అంతా నవ్వుకున్నారు. ఈ సందర్భంగా తన మాటల వెనుక ఉన్న మరణాన్ని బయటపెట్టారు చంద్రబాబు. అధిక జనాభా ఉండడం ప్రయోజనకరంగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వయోధిక వృద్ధుల సంఖ్య అధికంగా ఉందని.. యూరప్, జపాన్, చైనాలో వృద్ధుల సంఖ్య ఎక్కువ అని గుర్తు చేశారు. అందుకే అక్కడ యువత కోసం సంతానోత్పత్తికి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. మనదేశంలో కూడా అటువంటి పరిస్థితి రాకుండా సంతానం పెరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎక్కువమంది పిల్లలను కణాలని కూడా పిలుపునిచ్చారు.
* యువత పెరగాలన్నది ఆకాంక్ష..
పిల్లలను కనక పోవడం వల్లే యువత సంఖ్య తగ్గుముఖం పడుతుంది అన్నది చంద్రబాబు అభిప్రాయం. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఒక అంచనా ఉంది. యువత పెరిగితేనే ఈ దేశానికి భవిత అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా చాలా తక్కువ. దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రయోజనాలు ఆశించిన స్థాయిలో దక్కవు. అందుకే ఏపీలో జనాభా పెరగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. తన అభిప్రాయాన్ని ప్రజల ముందే వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
జనాభా తగ్గిపోయే సమయంలో కష్టపడి నలుగురు పిల్లల్ని కన్నాడు, అందుకే వారి పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటాను – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు pic.twitter.com/2tASMkNFkd
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2025