CM Chandrababu : ఏపీలో( Andhra Pradesh) మరో ఎన్నికల హామీని అమలు చేసి చూపించారు సీఎం చంద్రబాబు. మత్స్యకారులకు వేట నిషేధ భృతిని అందించారు. గత ప్రభుత్వం కంటే రెట్టింపు పరిహారాన్ని అందించి మత్స్యకారుల కళ్ళలో ఆనందం నింపారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. మత్స్యకార చేయూత పథకం కింద.. వేట నిషేధ సమయానికి గాను 20వేల రూపాయల చొప్పున..భృతిని అందించారు. లక్షలాదిమంది మత్స్యకారుల ఖాతాల్లో 20వేల రూపాయల చొప్పున నగదు జమ చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను ప్రభుత్వం 296 కోట్ల రూపాయల వరకు విడుదల చేసింది.
Also Read :శ్రీకాకుళం జిల్లా చంద్రబాబు.. ఎన్నికల హామీకి శ్రీకారం!
* తొలిసారి పెద్ద పథకం..
కూటమి( allians ) అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పెద్ద పథకం ఇదే. ఇప్పటివరకు చాలా రకాల పథకాలను అమలు చేశారు. సామాజిక పింఛన్ మొత్తాన్ని పెంచారు. బకాయిలతో అందించారు. అన్న క్యాంటీన్లను తెరిచారు. ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు. మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు అందించారు. వచ్చే నెలలో అన్నదాత సుఖీభవతో పాటు తల్లికి వందనం పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో మత్స్యకారులకు భరోసా ఇస్తూ పెద్ద ఎత్తున నగదు పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
* లక్షలాది మత్స్యకార కుటుంబాలకు సాయం..
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం( sea shore area ) ఉంది. తిరుపతి జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా డుంకూరు వరకు వెయ్యి కిలోమీటర్ల మేరకు సముద్ర తీరం ఉంది. వేలాది మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే ఏటా రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం. ఆ సమయంలో చేపలు గుడ్లు పెడతాయి. సంతానోత్పత్తి చేస్తాయి. మరపడవలతో వేట సాగిస్తే వాటి సంతానోత్పత్తికి విఘాతం కలిగే అవకాశం ఉంది. అందుకే కేంద్ర మత్స్యశాఖ రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమలు చేస్తోంది. ఆ సమయంలో మత్స్యకారులు తీరానికి పరిమితం అవుతారు. ఎటువంటి జీవనోపాధి ఉండదు. అందుకే తాము అధికారంలోకి వస్తే.. వేట నిషేధ సమయంలో 20వేల రూపాయల చొప్పున భృతి అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ సర్కార్ పదివేల రూపాయల చొప్పున అందించగా.. దానికి రెట్టింపు చేస్తూ చంద్రబాబు ఇప్పుడు అందించేందుకు ముందుకు వచ్చారు. దీనిపై మత్స్యకారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంచి పని చేశారంటూ చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.