CM Chandrababu : ఏపీలో( Andhra Pradesh) కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల 27 నుంచి మూడు రోజులు పాటు తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. ఇంతకీ బిజీ షెడ్యూల్లో సైతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి పర్యటన అధికారికంగా, రాజకీయంగా కీలకంగా మారుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇప్పటికే వరుస అరెస్టులతో పాటు కేసులు నమోదవుతుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా దారుణంగా దెబ్బతీయాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఎందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. మహానాడులో సంచలనాలు నమోదు కానున్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా టిడిపి కూటమిలో చేరబోతున్నారన్న వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారుతోంది.
Also Read : ఏపీలో కొత్తగా ఫైవ్ స్టార్ హోటల్స్.. భారీగా భూ కేటాయింపులు!
* 22 నుంచి మూడు రోజులు ఢిల్లీలోనే బాబు..
ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు( mahanadu ) జరగనుంది. అంతకంటే ముందే చంద్రబాబు 22న ఢిల్లీకి వెళ్ళనున్నారు. 23న కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు జరపనున్నారు. ఆ మరుసటి రోజు 24వ తేదీ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో చంద్రబాబు పాల్గొనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనల ప్రస్తావన చేయనున్నారు. ఇప్పటికే నీతి ఆయోగ్ సభ్యులకు ఏపీలో తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ గవర్నెన్స్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే పర్యటనలో రాజకీయపరమైన అంశాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది.
* కూటమిలోకి వైసీపీ రాజ్యసభ సభ్యుడు..
ఏపీలో ఓ రాజ్యసభ సభ్యుడు టిడిపి కూటమిలో( TDP Alliance ) చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ నాలుగు పదవులు టిడిపి కూటమి ఖాతాలో చేరాయి. ఇప్పుడు మరో సభ్యుడు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కూటమి పార్టీలపరంగా తనకు రాజ్యసభ అవకాశం కల్పిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని సదరు సభ్యుడు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభకు సంబంధించి బిజెపి ఎక్కువగా పదవులు ఆశిస్తోంది. రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలను బిజెపి కోరుకుంటుంది. గత కొద్ది రోజులుగా జరుగుతుంది ఇదే. అందుకే బిజెపి హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లి వైసీపీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
* లోకేష్ ప్రమోషన్ కోసం చర్చించేందుకు..
మరోవైపు ఏపీలో అధికార టిడిపి మహానాడుకు సిద్ధమవుతోంది. మొన్నటికి మొన్న మంత్రి నారా లోకేష్( Nara Lokesh ) ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఆయన ఆశీర్వాదం కూడా పొందారు. తెలుగుదేశం పార్టీలో ఆయనకు ప్రమోషన్ ఖాయమని ప్రచారం సాగుతోంది. ప్రధాని ఆశీర్వాదం కోసమే చంద్రబాబు ఆయనను ఢిల్లీకి పంపించారని కూడా టాక్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కుమారుడు ప్రమోషన్ కోసమే ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.