https://oktelugu.com/

WhatsApp – AI : వాట్సాప్‌లో ఏఐ.. ఏ సమాచారమైనా చిటికెలో..

WhatsApp - AI : రాబోయే రోజుల్లో ఇందులోని సమాచారాన్ని నేరుగా మెయిల్‌ లేదా ఇతర వేదికలకు పంపుకునే ఆప్షన్‌ కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Written By: NARESH, Updated On : July 1, 2024 2:08 pm
AI innovation in WhatsApp

AI innovation in WhatsApp

Follow us on

WhatsApp – AI  : ఇక నుంచి ఏదైనా సమాచారం కావాల్సి వచ్చినా.. తెలుసుకోవాలన్నా.. సెర్చ్‌ ఇంజిన్‌ను ఆశ్రయించాల్సిన పనిలేదు.. వాటాప్‌లో చాట్‌ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. అందుకోసం మెటా సంస్థ ఏఐని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ మాతృ సంస్థ అయిన మెటా..ఈ అవకాశాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నాలుగైదు రోజులుగా వాట్సాప్‌ యూజర్లకు ఈ ఆప్షన్‌ అప్‌డేట్‌ అయింది.

ఆప్షన్‌ ఇలా..
ఆండ్రాయిడ్‌ ఫనోన్లలో వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే కుడివైపు కిందన, ఐఫోన్‌లో అయితే డిస్‌ప్లే పైభాగంలో కెమరా ఐకాన్‌ పక్కన నీలం రంగు రింకు ఆకారం కనిపిస్తుంది. దానిని నొక్కగానే మనకు చాటింగ్‌కు స్పందిస్తుంది. మనకు ఏ సమాచారం కావాలో చెబితో శోధించి తాజా సమాచారం మన ముందు ఉంచుతుంది. టెక్ట్స్‌ రూపంలో అడిగితే దానికి అనుగునంగా ఏఐ ఫొటోలు, యానిమేషన్‌ క్లిప్పింగులనూ సృష్టిస్తుంది. మీకు అందించే సమాచారం పూర్తిగా కావాలంటే ఎక్కుడ లభిస్తుందో కూడా సూచిస్తుంది. అలాగని వ్యక్తిగత జీవితం, వారి గోప్యతను దెబ్బతీసే విషయాలు, ఆరోగ్యం తదితర అంశాలపై ఊహాజనిత ప్రశ్నలు అడిగే మాత్రం వ్యక్తుల గోప్యతను గౌరవించడం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల ఫొటోలను ఇవ్వడం లేదు. వారికి సంబంధించిన వివరాలను మాత్రమే ఇస్తుంది.

తెలుగులోనూ సమాచారం..
వాట్సాప్‌ ఏఐ ద్వారా సమాచారం తెలుసుకోవడం చాలా సులభం. స్నేహితులతో ఎలా చాటింగ్‌ చేస్తామో అదీ అలాగే. ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సంబంధించిన సమాచారం ఇస్తుంది. తర్వాత ప్రశ్నలు కొనసాగించవచ్చు. అందుకు అనుగుణంగా సమాధానాలు వస్తుంటాయి. హిస్టరీ, సైన్స్‌ సబ్జెక్టుల్లో క్లిష్టమైన అంశాలను వివరించడం, మెయిల్స్, లెటర్స్‌ రాయడం వరకు వాట్సాప్‌ ఏఐ మనకు సహాయం చేస్తుంది. అనువా ప్రక్రియలో మనకు తోడ్పాటు అందిస్తుంది. వాట్సాప్‌ చాట్‌బాట్‌ మీ ప్రశ్నను తెలుగులో అర్తం చేసుకున్నా… దాని సమాధానం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇందులోని సమాచారాన్ని నేరుగా మెయిల్‌ లేదా ఇతర వేదికలకు పంపుకునే ఆప్షన్‌ కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.