Chittoor Mango Crisis: చిత్తూరు జిల్లా( Chittoor district) మామిడి పంటకు పెట్టింది పేరు. అక్కడ విస్తారంగా మామిడి సాగు అవుతుంది. ఇక్కడ మామిడినే ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అవసరం అయితే ప్రత్యేక రైలును కూడా నడుపుతుంటారు మామిడి పంట తరలించేందుకు. అటువంటి చిత్తూరు జిల్లాలో మామిడి ధర సంక్షోభంలో పడింది. ఈ ఏడాది దిగుబడి గణనీయంగా ఉంది. కానీ ధర మాత్రం ఉసురుమనిపిస్తోంది. ఈ ఏడాది మామిడి కి మద్దతు ధర కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ సీజన్లో చివరి కాయ వరకు కొంటామని చెప్పారు. కిలో ధరను 12 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఇప్పుడు కొనుగోలు నిలిపి వేయడంతో రైతులు తమ మామిడి పంటను రోడ్డు పక్కనే టన్నుల కొద్ది పడేశారు. ప్రస్తుతం అక్కడ మామిడి పంట పరిస్థితిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.
Also Read: పంటల బీమా చెల్లింపు గడువు పెంపు.. ఏపీ రైతులకు బిగ్ అప్డేట్!
రోడ్డు పక్కనే టన్నులకొద్ది
ప్రధానంగా పుంగనూరు రోడ్డులో( Punganuru Road) రోడ్డు పక్కన టన్నులకు మామిడి పంట కనిపిస్తోంది. సోమల మండలంలో మామిడికాయలు రోడ్డు పక్కనే పడేశారు. చిత్తూరు జిల్లాను మ్యాంగో నగర్ గా పిలుస్తారు. అటువంటి చోట మామిడి కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల కేంద్రానికి సమీపంలో ప్రైవేటు మార్కెట్ మండీలు ఏర్పాటు చేశారు. కానీ ఆశించిన స్థాయిలో మామిడికి మద్దతు ధర లేదని రైతులు వాపోతున్నారు. కనీసం రవాణా చార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి బాగుంటే ధరలు ఉండడం లేదు. ధర బాగుంటే దిగుబడులు రావడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే తాము రోడ్డు పక్కన మామిడి కాయలను పడేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మామిడి పంట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read:నిధులను విడుదల చేస్తూ ఖరీఫ్ రైతులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..
రవాణా చార్జీలు సైతం రావట్లే..
ప్రభుత్వం మద్దతు ధరగా కేజీకి 12 రూపాయలు ప్రకటించింది. కానీ ప్రైవేటు మార్కెట్ మండీలలో మాత్రం ఎనిమిది రూపాయలకు తగ్గించి అడుగుతున్నారు. తోటల నుంచి మామిడికాయలను( mango) సేకరించి తరలించేందుకు రవాణా చార్జీలకు కూడా అవి చాలడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఎక్కడికి అక్కడే పంట ఉండిపోతోందని రైతులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజులపాటు కొనసాగితే మాత్రం పంట రోడ్డు పక్కనే అలానే పాడైపోతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిత్తూరు జిల్లాలో రోడ్డు పక్కన నిల్వ ఉన్న మామిడి పంట దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నో వర్డ్స్….ఇది మంచి ప్రభుత్వం…✌️#SaveFarmersInAP pic.twitter.com/l9K3AQy9T3
— Power_Ranger_Facts (@Neninthae_) June 28, 2025