Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan Horoscope : జగన్ జాతకం మరీ అంత దరిద్రంగా ఉందా? చిలుక జోష్యం...

CM Jagan Horoscope : జగన్ జాతకం మరీ అంత దరిద్రంగా ఉందా? చిలుక జోష్యం వైరల్

CM Jagan Horoscope : రావాలి జగన్.. కావలి జగన్..గత ఎన్నికల ముందు వైసీపీ స్లోగన్ ఇది. ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఓట్లు తెప్పించింది. అయితే నాలుగేళ్ల పాలనతో అంతులేని ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు జగన్. అందుకే విపక్షాలు పోవాలి జగన్ అన్న నినాదాన్ని అందుకున్నాయి. రుషికొండలాంటి చరిత్ర ఆనవాళ్లను చేరిపేస్తున్నందున ప్రకృతి సైతం ప్రకోపంగా మారిందని చెబుతున్నారు. ప్రకృతి మాట అటుంచితే.. నోరులేని పక్షులు సైతం జగన్ పోవాలని బలంగా కోరుకుంటుండడం విశేషం. జోష్యం చెప్పే ఓ చిలుక తన మనసులోని భావాన్ని బయటపెట్టేసరికి జగన్ పేరిట జోష్యం చెప్పించుకున్న వారికి మైండ్ బ్లాక్ అయ్యింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు రోడ్డు పక్కన చిలుక జోష్యం చెప్పే వ్యక్తి దగ్గరకు వెళ్లారు. సీఎం జగన్ తో పాటు రాష్ట్ర భవితపై జోష్యం చెప్పమని అడిగారు. ‘ రామ్మా చిలకమ్మా జగన్ గురించి అడుగుతున్నారు.. కరెక్ట్‌గా తీయమ్మా’ అని ఆ చిలక యజమాని అడిగాడు. పంజరంలో నుంచి బయటికొచ్చిన ఆ చిలుక నాలుగైదు కార్డులు తీసి పక్కనెట్టి.. చివరిగా ఒక కార్డును యజమానికి ఇస్తుంది. ఆ కార్డు ఓపెన్ చేసి చూడగా.. రాక్షసుడి (అసురుడు) బొమ్మ రావడం చూసి జోష్యం చెప్పే వ్యక్తికి ఏం చెప్పాలో తెలియక కొద్దిసేపు అలానే ఉండిపోయాడు. ఎలాగోలా ధైర్యం కూడదీసుకున్నారు. ఎవరికైనా ఇలాంటి జాతకం వచ్చిందా.. రాలేదు. నోరులేని చిలక కూడా చెప్పిందయ్యా.. జగన్ గురించి.. అలాంటోడు ఆయన. అని జ్యోతిష్యం చెప్పే వ్యక్తి యువకులకు చెప్పడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జగన్ జాతకం ఇంత దరిద్రంగా ఉందా? అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇటువంటి జాతకాలు, జోష్యాలు బయటకు వచ్చాయి. పొలిటికల్ స్ట్రాటజిస్టులు వచ్చిన తరువాత ఈ తరహా ట్రిక్కులు స్టార్టయ్యాయి. మొన్న ఆ మధ్యన జాతీయ స్థాయిలో జోష్యాలు చెప్పే వ్యక్తితో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని జోష్యం చెప్పించుకున్నట్టు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు.. వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు కొంతమంది జోష్యాల పేరిట వీడియోలు పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ చిలక జోష్యం పేరిట పెట్టిన వీడియోలు రాజకీయ ప్రత్యర్థులు పెట్టినవేనని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

YouTube video player

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version