Biryani Offer: తెలుగు రాష్ట్రాలకు దసరా ఫీవర్ వచ్చింది. దసరా సెలవులు కూడా ప్రారంభం కావడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. దేవీ నవరాత్రులు జరుగుతుండడంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామ దేవతలకు సైతం పూజలు జరుగుతుండడంతో ఎక్కువమంది మొక్కులు చెల్లించుకుంటున్నారు. దసరా సీజన్ కావడంతో మార్కెట్లో కొత్త ఆఫర్లు నడుస్తున్నాయి. చాలాచోట్ల కొత్త రెస్టారెంట్లు, కొత్త దుకాణాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను చేరువ అయ్యేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ ఆఫర్లు ఆసక్తి గొల్పేలా ఉన్నాయి. ఈ తరుణంలో ఓ రెస్టారెంట్ భోజనప్రియ లకు దసరా కానుక ప్రకటించింది. కేవలం మూడు రూపాయలకే బిర్యానీ ఆఫర్ ప్రకటన చేసింది. ఏలూరులో ఒక రెస్టారెంట్ బిర్యానీ ప్రియులకు నోరూరించే ఆఫర్ వెల్లడించింది. శనివారం ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా చికెన్ బిర్యానీని కేవలం మూడు రూపాయలకే అందిస్తామంటూ ప్రకటించడంతో.. బిర్యానీ ప్రియులు క్యూ కట్టారు.బిర్యానీని ఇష్టంగా తిన్నారు.అయితే హోటల్ యాజమాన్యం పై ఇది భారమే అయినా.. మార్కెట్లో వెళ్లేందుకు ఇదో మార్గమని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల జంగారెడ్డిగూడెంలో ఓ రెస్టారెంట్ ప్రారంభం అయ్యింది. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు భోజన ప్రియుల కోసం అన్లిమిటెడ్ ఆఫర్ పెట్టారు. మూడు రూపాయలకే చికెన్ బిర్యానీ అని ప్రకటన చేశారు. అన్ లిమిటెడ్ బిర్యానీ అంటూ ప్రచారం జరగడంతో బిర్యానీ ప్రియులు షాపు ఎదుట క్యూ కట్టారు. అయితే వచ్చిన జనాలను కంట్రోల్ చేయడానికి చివరకు వారు సెక్యూరిటీని పెట్టుకోవాల్సి వచ్చింది. జన రద్దీని చూసి ఆ ఆఫర్ ను కేవలం 3 గంటలపాటు మాత్రమే వర్తింపజేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వందలాదిమంది చేరుకోవడంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. ఈ మూడు రూపాయల చికెన్ బిర్యానీని దాదాపు నాలుగు వేల నుంచి 5000 మంది వరకు వినియోగించుకున్నట్లు రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు.
* సూపర్ రెస్పాన్స్
మరోవైపు ప్రారంభంలోనే మంచి గుర్తింపు సాధించింది ఆ రెస్టారెంట్. ప్రజల నుంచి ఆ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని నిర్వాహకులు భావించలేదు. అయితే కేవలం బిర్యాని మూడు రూపాయలకు అందించడమే కాదు.. చాలా రకాల ఆఫర్లను అమలు చేశారు. 290 రూపాయలకి వ్యక్తి తిన్నంత బిర్యాని, 380 లకు ఒక వ్యక్తి నాలుగు రకాల స్టార్టర్లతో ఎంతైనా తినే ఆఫర్ ను సైతం అందించారు. 580 లకు ఇద్దరు వ్యక్తులు రెస్టారెంట్ లోని మెనూలో ఉన్న 30 రకాల ఐటమ్స్ తినే ఆఫర్ ఇచ్చారు. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు వేలాదిగా క్యూ కట్టారు. అయితే కేవలం మూడు గంటల పాటుఈ ఆఫర్ వర్తించడంతో చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు.