Prakash Raj: ఉదయనిధితో పోల్చుతూ పవన్ ను తక్కువ చేసిన ప్రకాష్ రాజ్

గత కొద్దిరోజులుగా పవన్ పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు ప్రకాష్ రాజ్.కానీ ఈసారి ఏకంగా రంగంలోకి దిగారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో పోల్చుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను తక్కువ చేసి మాట్లాడడం విశేషం.

Written By: Dharma, Updated On : October 6, 2024 11:38 am

Prakashraj-Pawan kalyan

Follow us on

Prakash Raj: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను ప్రకాష్ రాజ్ విడిచిపెట్టడం లేదు. ఇంకా వెంటాడుతున్నారు. ఆయన తీరును తప్పు పడుతూనే ఉన్నారు. దీంతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ ఆ స్థాయిలో ప్రకాష్ రాజ్ పైరియాక్షన్ కావడం లేదు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలోపవన్ అభిప్రాయాలతో ప్రకాష్ రాజ్ విభేదించిన సంగతి తెలిసిందే.దీంతో వారి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.వరుసగా పవన్ చర్యలను తప్పుపడుతూ ప్రకాష్ రాజ్ ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు.లడ్డు వివాదం నేపథ్యంలో జాతీయస్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరం అని పవన్ ఆకాంక్షించారు.తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. దేశంలో ఉన్న మత వివాదాలు చాలవా అని పవన్ ను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నది మీరే కదా అని నిలదీసినంత పని చేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ అసలు లడ్డు వివాదంతో ప్రకాష్ రాజ్ కు పని ఏంటని ప్రశ్నించారు. అప్పటినుంచి వివాదం రగులుతూనే ఉంది.

* పవన్ వెర్షన్ వేరేలా
అయితే ఈ విషయంలో పవన్ వెర్షన్ వేరేలా ఉంది. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని.. అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ మండిపడ్డారు. అయినా సరే ప్రకాష్ రాజ్ వెనక్కి తగ్గలేదు. ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన తమిళ హీరో కార్తీ.. లడ్డు వివాదం నేపథ్యంలో చిన్నపాటి అర్థం వచ్చేలా మాట్లాడారు. దానిని పవన్ తప్పు పట్టడంతో క్షమాపణలు కోరారు. దానిపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. చేయని తప్పునకు కార్తీతో క్షమాపణలు చెప్పించడం ఏంటి అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటి అవాంతరం.. ఎందుకు మనకి అయోమయం ఏది నిజం అంటూ ట్వీట్ చేశారు.

* సెటైరికల్ పోస్టులు
సుప్రీంకోర్టు లడ్డు స్పందించిన క్రమంలో కూడా ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. దయచేసి దేవుడిని నీ రాజకీయాల్లోకి లాగకండి అంటూ పోస్ట్ చేశారు. పవన్ తిరుపతి వారాహి సభలో సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. అప్పుడు కూడా ప్రకాష్ రాజ్ సెటైరికల్ ట్విట్ చేశారు. సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి.. సమాజ రక్షణలో మేముంటాం అంటూ ట్విట్ సాగింది. అయితే ఇక్కడితో ప్రకాష్ రాజ్ ఊరుకుంటారని అంతా భావించారు. కానీ ఈసారి రాజకీయ ప్రకంపనలు రేపేలా ఒక ప్రకటన చేశారు.

* అక్కడి నేతపై ప్రశంసలు
తమిళనాడులో ఓ పుస్తకావిష్కరణ సభలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. అదే సభకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ఉదయనిది స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు. ఉదయనిది స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మమంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పవన్ కు చురకలు అంటించారు. నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరఫున మాట్లాడతాను అంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగానే ప్రకాష్ రాజ్ స్పందించారు. కానీ ఈసారి తమిళ నాడు డిప్యూటీ సీఎంను పొగుడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను తక్కువ చేసి మాట్లాడడం మాత్రంరాజకీయంగా వివాదం సృష్టించే అవకాశం ఉంది. దీనిపై జనసైనికులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.