Homeఆంధ్రప్రదేశ్‌AP News :ఇంత దారుణ మాటలా? అసలు మనిషివేనా? ఇలాంటి వాడిని వదలొద్దు

AP News :ఇంత దారుణ మాటలా? అసలు మనిషివేనా? ఇలాంటి వాడిని వదలొద్దు

AP News : రాజకీయ విమర్శలు అనేవి సహజం. అవి సిద్ధాంత పరంగా ఉంటాయి. ఒక పార్టీ, ఒక నాయకుడి విధానాలు నచ్చక విమర్శలు చేస్తుంటారు. కానీ ఏపీలో( Andhra Pradesh) ఈ విమర్శల రూటు మారుతోంది. వ్యక్తిత్వ హననానికి కారణమవుతోంది. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక తమ అభిప్రాయాలను చెప్పే క్రమంలో చాలామంది బ్లాస్ట్ అవుతున్నారు. ప్రత్యర్ధుల కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలా వ్యాఖ్యలు చేసిన చాలా మంది ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. అయితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేని కొందరు టిడిపి సానుభూతిపరులు కూడా ఇప్పుడు అలానే మాట్లాడుతున్నారు. వీరు సైతం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజాగా ఓ ఐ టిడిపి బ్రతికి వైయస్ జగన్ కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడాడు. అది విపరీతంగా వైరల్ కావడంతో చివరకు క్షమాపణ చెప్పాడు.

Also Read : అమరావతి గెలిపిస్తుంది.. చంద్రబాబు ప్లాన్ అదే!

* దారుణ భాషతో..
ఉమ్మడి అనంతపురం( combined Ananthapuram district) జిల్లా రాప్తాడు లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు తెలిసినవే. పార్టీ శ్రేణులకు పరామర్శించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. పోలీసులను బట్టలూడదీసి నిలబడతామని హెచ్చరించారు. ఈ కామెంట్స్ పై కిరణ్ అనే ఐ టీడీపీ కార్యకర్త టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించే ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడు. వైయస్ జగన్ సతీమణి భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసి సైకో ఆనందం పడ్డాడు. పిల్లలపై కూడా లేనిపోనివి మాట్లాడాడు. గతంలో కూడా కిరణ్ వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉండేది. ఏకంగా అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అంటూ సంబోధించేవాడు. ఇప్పుడు ఏకంగా కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడాడు. అవి విమర్శలకు గురికావడంతో క్షమాపణలు కోరాడు.

* చాలామంది పై కేసులు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చాలామంది పై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు ఐటీడీపీకి చెందిన క్రియాశీలక కార్యకర్త ఒక్కరు అలా మాట్లాడినా.. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే బోరుగడ్డ అనిల్ కుమార్, పోసాని కృష్ణ మురళి, వల్లభనేని వంశీ మోహన్ వంటి నేతలను అరెస్టు చేశారు. కానీ ఏకంగా ఓ మాజీ ముఖ్యమంత్రి కుటుంబం పై విరుచుకుపడిన కిరణ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఇలాంటివారిని ప్రోత్సహించిన రాజకీయ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ విషయంలో టిడిపి నాయకత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

* బూతులు లేకుండా చూస్తామన్నారుగా.. రాజకీయాల్లో( politics) బూతులు లేకుండా చూస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఏకంగా ఐటీడీపీలో కీలకంగా ఉన్న కిరణ్ అనే వ్యక్తి ఇలా మాట్లాడాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా దీని వెనుక పార్టీ లైన్ ఉంటుంది అన్నది ఒక ప్రచారం. అయితే ఈ విషయంలో టిడిపి నాయకత్వానికి సంబంధం లేకపోయినా.. మూల్యం చెల్లించుకునేది మాత్రం ఆ పార్టీ నే. ఇటువంటి వారి విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకుంటే మంచిది. లేకుంటే ప్రజాస్వామ్యానికే విఘాతం కలగక మానదు.

Also Read : విజయసాయిరెడ్డి రీఎంట్రీ.. నేరుగా పార్లమెంట్లోకి!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular