Chandrababu Naidu’s vision: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు( CM Chandrababu). ఈ విషయం అందరికీ సుపరిచితమే. సంక్షేమం కంటే అభివృద్ధి తోనే ప్రజలకు భవిత అని నమ్మిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి బీజం వేసిన నేత కూడా. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసి అమలు చేయగల నేర్పరి చంద్రబాబు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు. 2019 వరకు అభివృద్ధికి పునాదులు వేసి బాటలు తీసే క్రమంలో అధికార మార్పిడి జరిగింది. అది రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు ఏపీ ప్రజలు. ఇప్పుడు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.
దూరదృష్టి కలిగిన నేత
చంద్రబాబు దార్శనికత గురించి ఎంత చెప్పినా తక్కువే. సైబరాబాద్ ( Cyberabad )నిర్మించి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఐటికి బీజం వేసింది ఆయనే. ఐటి జ్ఞానిగా అభివర్ణించబడే చంద్రబాబు.. ఈ గవర్నెన్స్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలను ప్రోత్సహించి.. విద్య, ఆరోగ్య, మౌలిక, ఆర్థిక పాలన రంగాల్లో సాంకేతికతను చూపించారు. ఈ క్రమంలో ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అదే ఏపీకి అక్కరకు వస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణం అవుతోంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. కేవలం చంద్రబాబు సమర్థతతో ప్రపంచ దిగ్గజ పరిశ్రమలు, సంస్థలు ఏపీకి క్యూ కడుతున్నాయి.
ట్రెండ్ సెట్టర్ గా
ప్రస్తుతం టార్చ్ బేరర్( torch bearer ) గా నిలుస్తున్నారు చంద్రబాబు. ప్రతి 30 సంవత్సరాలకు ట్రెండ్ మారుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల గతిని మార్చింది చంద్రబాబు. అప్పట్లో దూరదృష్టితో ఐటీ ని డెవలప్ చేశారు. తరువాత పరిశ్రమలను పెద్ద ఎత్తున ఆకర్షించగలిగారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రవేశ పెడుతున్నారు. డ్రోన్ల రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచ నగరాల్లో ఒకటిగా నిలిచే అమరావతి రాజధానిని నిర్మించే భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదని భావిస్తున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా పరిగణించి పెద్ద ఎత్తున ఐటి పరిశ్రమలు సంస్థలు వచ్చేలా చేస్తున్నారు. పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి శాఖకు ప్రాధాన్యమిస్తూ నిధులు కేటాయిస్తున్నారు. రాజ్యాంగబద్ధ చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లపాటు పాలించి రికార్డు సృష్టించారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ఆరేళ్లపాటు సేవలందించారు. మరో నాలుగేళ్ల పదవీకాలంలో నవ్యాంధ్రప్రదేశ్ ను ప్రగతి పథంలో నెలపాలనుకుంటున్నారు.