HomeNewsTDP-BJP alliance Govt Politics: కూటమి రాజకీయం అదుర్స్.. ప్రత్యర్థికి చుక్కలే!

TDP-BJP alliance Govt Politics: కూటమి రాజకీయం అదుర్స్.. ప్రత్యర్థికి చుక్కలే!

TDP-BJP alliance Govt Politics: కూటమి చర్యలు రాజకీయ ప్రత్యర్థులకు సైతం మింగుడు పడడం లేదు. సీఎం చంద్రబాబు( CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ మైత్రి రోజు రోజుకు బలపడుతోంది. ఈ కూటమి ఎన్నాళ్లు ఉంటుంది?ఈ పార్టీలు ఎంతవరకు కలిసి ఉంటాయి? విభేదాలు వచ్చి కచ్చితంగా విడిపోతాయి అన్న మాటలు వినిపించాయి. సహజంగానే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టిడిపి.. జనసేనకు ఇచ్చే ప్రాధాన్యతను చాలామంది తప్పు పడతారు. రకరకాల సమస్యలు ఎదురవుతాయి. కానీ వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రెండు పార్టీల మైత్రికి వచ్చే ఇబ్బందులను అధిగమించి ఇట్టే ముందుకు సాగుతున్నారు. తమ మధ్య ఏ విచ్చిన్న శక్తి పనిచేయదని స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలుగుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రయత్నాలను ఆదిలోనే తుంచేస్తున్నారు. రాజకీయ చదరంగంలో ఎంతో పరిణితితో ఆ ఇద్దరు వ్యవహరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టేలా చేస్తున్నారు.

పవన్ మాట.. లోకేష్ బాట
ఇక నారా లోకేష్( Nara Lokesh ), పవన్ కళ్యాణ్ మధ్య పరస్పర సహకారం గురించి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చ నడుస్తోంది. పవన్ మాట.. లోకేష్ పాట అన్నట్లు సాగుతున్న పొలిటికల్ జర్నీ ఆసక్తి రేపుతోంది. వీరిద్దరి మధ్య పరస్పర సహకారం.. రోజురోజుకు పెరుగుతున్న అనుబంధం.. రాజకీయ ప్రత్యర్థులకు నిరాసే మిగుల్చుతోంది. కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గి రాజేయాలని ప్రత్యర్ధులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారు ఎంతో సమన్వయంతో నడుచుకోవడమే కాకుండా.. ఇరు పార్టీల క్యాడర్ కు సరైన దిశా నిర్దేశం చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు.

కేంద్రం సంపూర్ణ సహకారం..
ప్రస్తుతం కూటమి పెద్దలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఉన్నారు. తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ నడిపిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సంపూర్ణ సహకారం అందిస్తోంది. మూడు పార్టీల ఉమ్మడిగా జరుగుతున్న రాజకీయంతో ప్రత్యర్థి విలవిలలాడుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించడం ద్వారా రాజకీయంగా టిడిపి కూటమి మరింత బలపడేలా కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోంది. ఇలా ఎలా చూసినా గత ఏడాది కాలంగా కూటమి రాజకీయంగా మరింత బలపడిందనే చెప్పవచ్చు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular