Chandrababu: అదాని కేసులో జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికా కోర్టులో ఆదాని అవినీతి వ్యవహారంపై అక్కడి దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇండియాలో కూడా విద్యుత్తు ఒప్పందాల కోసం అక్కడ అధికారులతో పాటు ప్రభుత్వాధినేతలకు లంచాలు ఇచ్చారన్నది ప్రధాన అభియోగం. అయితే అక్కడ నేరుగా ఎక్కడ జగన్ ప్రస్తావన చేయలేదు. కానీ చాలా చోట్ల మాత్రం ఏపీ చీఫ్ మినిస్టర్ను అదాని కలిసినట్లు ప్రస్తావించారు. అదే సమయంలో ప్రముఖుడికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో జగన్ చుట్టూ అనుమానాలు పెరుగుతున్నాయి. పైగా దీనిపైనే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుండడంతో జగన్ ఇరకాటంలో పడ్డారు. అయితే జగన్ పేరు ప్రస్తావనపై కూటమి ఆచితూచి స్పందిస్తోంది. కేంద్రంతో ఉన్న సంబంధాలు కారణంగా ఆదానీ వివాదం పైన పెద్దగా స్పందించడం లేదు. కానీ జగన్ విషయంలో మాత్రం ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం న్యాయపరంగా, రాజకీయపరంగా మంతనాలు సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఒకవేళ ఢిల్లీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం జగన్ పై ఎదురుదాడికి టిడిపి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను వదలకూడదని భావిస్తోంది. కానీ బిజెపి పెద్దల ఆలోచనకు అనుగుణంగా అడుగులు వేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఆదానీ ప్రస్తావన లేకుండా జగన్ అవినీతిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై విస్తృతంగా చర్చిస్తున్నారు.
* న్యాయ నిపుణుల సలహాతో
అమెరికాలో మోపిన అభియోగాల ప్రకారం అవినీతి నిరోధక చట్ట ప్రకారం కేసు నమోదు చేయవచ్చా? లేదా? అని నిపుణుల సలహా కోరింది ఏపీ ప్రభుత్వం. న్యాయ నిపుణుల నుంచి సానుకూలత వస్తే జగన్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తోంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ అధికరణం ప్రకారంమాజీ సీఎంను అరెస్టు చేసి విచారించడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి. అయితే అప్పట్లో గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తనను అరెస్టు చేశారని చంద్రబాబు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
* నాటి తన అరెస్టును గుర్తుచేస్తూ
అసలు ఆధారాలు లేని అవినీతి కేసులో తనను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు చంద్రబాబు. కానీ ఒక అగ్రరాజ్యంలో ఏపీ ప్రభుత్వాధినేత లంచం తీసుకున్నారని అభియోగాలు రావడం చిన్న విషయం కాదు. అయితే ఈ వ్యవహారం అదానీది.. కేంద్ర పెద్దల అనుమతితో ముందుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇంతవరకు బిజెపి స్పందన ఏంటన్నది తెలియదు. అయితే అదానీతో సంబంధం లేకుండా అగ్రరాజ్యంలో.. ఈ అవినీతి మరొక వెలుగు చూడడంతో.. ఒకవేళ బిజెపి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం చంద్రబాబు విడిచిపెట్టరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ అభిప్రాయం కీలకంగా మారింది.