Rushikonda Palace: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను మించి.. రిషికొండ ప్యాలెస్.. ఆశ్చర్యపోయిన చంద్రబాబు

ఇటలీ నుంచి మార్బుల్స్.. గుజరాత్ నుంచి పింక్ కలర్ ఇంటీరియర్.. కర్ణాటక నుంచి ఫర్నిచర్.. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రత్యేకమైన నాపరాయి.. అధునాతనమైన రంగులు.. అనితర సాధ్యమైన హంగులు.. అదేపనిగా చంద్రబాబు చూస్తున్నారు.. ప్రతి నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 3, 2024 9:23 am

Rushikonda Palace

Follow us on

Rushikonda Palace: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. ఎప్పటినుంచో ఆయన అనుకుంటున్నప్పటికీ.. ఇప్పటికి కుదిరింది. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిషికొండ ప్యాలస్ పై అనేక విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ప్రభుత్వ కార్యక్రమాల కోసం వాడతామని ప్రకటించింది. ఆమధ్య టిడిపి నేతలు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. దానిని హాస్పిటల్ గా ఉపయోగిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కాని.. ఆ ప్రతిపాదన ఆగిపోయింది.. అనంతరం మళ్లీ ఇన్నాళ్లకు చంద్రబాబు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. ఒక్కో నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించారు. సంబంధిత అధికారులు, ఇతర పార్టీ నాయకులతో సరదాగా సంభాషించారు ఆ నిర్మాణాన్ని ఎలా చేశారు? ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? దేనికోసం ఇంతటి స్థాయిలో హంగామా చేశారు? అనే విషయాలను చంద్రబాబు తెలుసుకున్నారు.

వైట్ హౌస్ ను మించిపోయిన సౌకర్యాలు..

రిషికొండ ప్యాలస్ లో సౌకర్యాలు వైట్ హౌస్ ను మించిపోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు..”వైట్ హౌస్ అత్యంత అధునాతనంగా ఉంటుంది. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉంటున్న అమెరికాలో శ్వేత సౌధం అనేది ఆ దేశ అధ్యక్షుడికి అధికారిక నివాసం. అందులో అనితర సాధ్యమైన సౌకర్యాలు ఉంటాయి. జగన్ కట్టించిన ఈ ప్యాలస్ లోనూ అదే స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయి. వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్షుడు ఉంటాడు కాబట్టి ఆ స్థాయిలో సౌకర్యాలను కల్పించారు. మరి ఈ ప్యాలస్ ను ఆ స్థాయిలో కట్టాల్సిన అవసరం ఏంటి? ఓవైపు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా.. వాటిని పక్కనపెట్టి దీనిని నిర్మించాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ ప్రజలు చూశారు.. ఈ దండగమారి ప్రభుత్వం ఎందుకనుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని సాగనంపారు.. 11 స్థానాలు ఇచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రజా కంటక పరిపాలన చేశాడో గుర్తుంచుకోవాలని” చంద్రబాబు వ్యాఖ్యానించారు.. ఇటీవల కాలం నుంచి చంద్రబాబు జగన్ మీద విమర్శలను పెంచారు. ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. ప్రభుత్వ ధనాన్ని సర్వనాశనం చేశారని ఆరోపిస్తున్నారు.. మొత్తంగా చూస్తే విశాఖపట్నం పర్యటన ద్వారా మరోసారి జగన్మోహన్ రెడ్డిని ప్రజల ముందు నిలబెట్టారు చంద్రబాబు. ప్రజధానన్ని దుర్వినియోగం చేశారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. మరి దీనిపై ఇంతవరకు వైసీపీ శ్రేణులు స్పందించలేదు. ఒకవేళ దీనిపై అతిగా స్పందిస్తే కేసులు నమోదు అవుతాయనే భయంతోనే వారు అలా చేయలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.