Amaravathi Farmers  : అమరావతిపై కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. అమరావతి రైతుల హ్యాపీ

గత ఐదు సంవత్సరాలుగా అమరావతి రైతులు పడిన బాధలు వర్ణనాతీతం. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చి కూడా బాధితులుగా మిగిలారు. మూడు రాజధానుల నిర్మాణంతో ఆందోళనకు గురయ్యారు. టిడిపి కూటమి రాకతో ఊపిరి పీల్చుకున్నారు.

Written By: Dharma, Updated On : August 2, 2024 3:55 pm
Follow us on

Amaravathi Farmers : ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించిన వారిలో అమరావతి రైతులు ముందుంటారు. చంద్రబాబు సీఎం అయితేనే అమరావతికి పూర్వవైభవం ఖాయమని వారు నమ్మారు.చంద్రబాబు సీఎం అయ్యేందుకు పూజలు చేశారు.ఎన్నో రకాలుగా ప్రచారం చేశారు.వారి పూజలు ఫలించాయి. ప్రచారం ప్రజల్లోకి వెళ్ళింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది.చంద్రబాబు సీఎం అయ్యారు.అందుకే ఇప్పుడు ఆనందంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతికి కొత్త కళ వచ్చింది.జంగిల్ క్లియరెన్స్ జరిగింది. విద్యుత్ లైట్లు వెలిగాయి.అమరావతిని పూర్వస్థితికి తెచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. మరో రెండు నెలల వ్యవధిలో అమరావతి యధాస్థితికి రావడం ఖాయం. అమరావతిలోని నిర్మాణాల స్థితిగతులను ఇప్పటికే సిఆర్డిఏ అధికారులు, నిపుణులు పరిశీలించారు. ఈరోజు దానిపై కీలక నివేదిక ఇవ్వనున్నారు. మరోవైపు కేంద్రం అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇలా వరుస శుభ పరిణామాలతో అమరావతి రైతులు ఆనందంగా ఉన్నారు.ఇప్పుడు మరింత ఆనందం పొందేలా అమరావతి రైతుల విషయంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది.ఈరోజు సాయంత్రం అధికారులతో భేటీ తర్వాత.. చంద్రబాబు ప్రత్యేక ప్రకటన చేయనున్నారు. మరోవైపు అమరావతికి కొత్తగా ఏఏ కంపెనీలను ఆహ్వానించాలని దానిపై చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ నిపుణులు సైతం నేడు అమరావతి కి రానున్నారు. మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాల సామర్ధ్యాన్ని అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా పునాది దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్,శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను పరిశీలించనున్నారు.అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.

* కౌలు కష్టాలు
అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. మూడు పంటలు పండే 36 వేల ఎకరాలను అందించారు. దీనికి ప్రతిఫలంగా రాజధానిని అభివృద్ధి చేసి వారికి మెరుగైన ప్లాట్లు ఇస్తామని నాడు చంద్రబాబు సర్కార్ ఒప్పందం చేసుకుంది. అయితే ఈ లోపు వ్యవసాయం లేకపోవడంతో ఆర్థికంగా వారు ఇబ్బందులు పడకుండా.. ఏటా కౌలు చెల్లింపునకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. టిడిపి ప్రభుత్వ హయాంలో ఏటా కౌలు చెల్లించింది. కానీ జగన్ సర్కార్ మాత్రం చుక్కలు చూపించింది. దీనిపై హైకోర్టు ఆదేశాలు వచ్చాక కౌలు చెల్లించడం పరిపాటిగా మారింది.

* చంద్రబాబు గుడ్ డెసిషన్
టిడిపి కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు అమరావతి రైతులు. ఇప్పుడు వారి ఆకాంక్షలను తీర్చే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. వారికి ఊరటనిచ్చే మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏటా ఇస్తున్న కౌలును అంతే మొత్తం వచ్చే ఐదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.

* నేడు సీఆర్డీఏ సమావేశం
ఈరోజు సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సిఆర్డిఏ సమావేశంలో కీలక నిర్ణయాలను వెల్లడించబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక్కో అడుగు ముందుకు వేయనున్నారు. అయితే గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ కు తొలి బాధితులు ఎవరంటే అమరావతి రైతులే. వారి ఉద్యమాన్ని హేళన చేశారు. వారిని పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చారు. అంతటితో ఆగకుండా వారి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో దాడులు, కేసులతో వెంటాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయాలతో వారికి వరుసగా ఉపశమనం కలుగుతుండడం విశేషం.