Jagan political strategy: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కూటమిపై జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. ఆ పార్టీ నుంచి నేతలంతా బయటకు వెళ్లిపోయారు. ఇక పార్టీ పని అయిపోయిందని అంతా విశ్లేషించారు. కానీ జగన్మోహన్ రెడ్డి బాగానే కోలుకున్నారు. జనాల్లోకి వచ్చి పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. అయితే జగన్ మోహన్ రెడ్డికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఎనలేని ఫోకస్ చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. టిడిపి కూటమి నెగిటివ్ ప్రచారం చేస్తే.. దానిని జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా మార్చుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైసిపి చేసిన తప్పు అదే..
టిడిపి కూటమి( TDP Alliance ) శ్రేణులు ఒకటి గమనించాలి. ఐదేళ్ల వైసిపి పాలనలో స్థానిక సంస్థల నుంచి ఉప ఎన్నికల వరకు అన్నింటిని స్వీప్ చేసింది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారో.. పవన్ కళ్యాణ్ కార్యక్రమాలను అడ్డుకున్నారో.. నాటి నుంచి ప్రభుత్వ పతనం ప్రారంభం అయింది. చంద్రబాబును ప్రజల మధ్య అరెస్టు చేయడం కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అదే తప్పును కూటమి ప్రభుత్వం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. అది ప్రజల్లోకి వెళితే మాత్రం ప్రమాదమే. అలా జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం కూటమి ప్రభుత్వంపై ఉంది.
Also Read: ఐదుగురు మంత్రులకు చెక్? క్యాబినెట్‌లో సంచలన మార్పులు!
ప్రత్యేక వ్యూహంతో వైసిపి..
ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సైతం అదే వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఆ పార్టీ ఆది నుంచి జన సమీకరణ అనేది ఒక పాలసీగా పెట్టుకుంది. మొన్నటి ఎన్నికల్లో సైతం అదే ఫార్ములాను అనుసరించింది. సిద్ధం పేరిట సభలను నిర్వహించి భారీగా జన సమీకరణ చేసింది. అయినా సరే దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే జనాలు వెళ్తారు. ఆ పార్టీ శ్రేణులు కచ్చితంగా హాజరవుతారు. ఆ పార్టీ సెంటిమెంట్ నుంచి పుట్టినది. కచ్చితంగా విపరీతమైన అభిమానులు ఆ పార్టీ సొంతం. మిగతా పార్టీలకు అభిమానులు ఉంటారు కానీ.. సమావేశాలకు హాజరయ్యేది తక్కువ. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలా కాదు. కచ్చితంగా వారు కార్యక్రమాలకు హాజరవుతారు.
జగన్ కు లేనిపోని ప్రచారం
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) పర్యటనలకు ఆంక్షలు విధించడం, అనుమతులు పరిమితం చేయడం వంటి వాటితో లేనిపోని ప్రచారం కల్పించినట్టు అవుతోంది. మీడియా అటెన్షన్ సైతం జగన్ పర్యటనపై పడుతోంది. జగన్ పర్యటన నాడు ఏమవుతుందో నన్న అటెన్షన్ కూడా రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తోంది. ఇలానే కూటమి వ్యవహరిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ ఇచ్చిన వారవుతారు. గ్రాఫ్ పెంచిన వారు అవుతారు. అందుకే కూటమి ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎంత పట్టించుకోకపోతే అంత మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.