Train Journey: మిగతా ప్రయాణాల కన్నా రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో దూర ప్రయాణాలు చేసేవారు ఎప్పుడు ట్రైన్ జర్నీనే కోరుకుంటారు. అయితే నిత్యం ట్రైన్ జర్నీ చేసేవాళ్ళు రైల్వే నిబంధనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వినియోగదారుల సౌకర్యార్థం కొన్నిసార్లు నిబంధనలను మారుస్తూ ఉంటారు. నిబంధనలు తెలుసుకోకుండా రైలు ప్రయాణం చేస్తే చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏ చిన్న మిస్టేక్ చేసిన పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇటీవల రైలు నిబంధనలో కొన్నిటిని మార్చారు. వీటిలో ముఖ్యంగా టికెట్ కన్ఫామ్ విషయంలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ను ప్రయాణికుల సౌకర్యార్థం సమయాన్ని పెంచారు. అదేంటంటే?
Also Read: ఇవే తగ్గించుకుంటే మంచిది.. లేదంటే పోతార్రరేయ్.. సజ్జనార్ వీడియో వైరల్
ట్రైన్ జర్నీ చేసేవారు రకరకాల టికెట్లను కొనుగోలు చేస్తారు. కొందరు రైల్వే స్టేషన్ లోని కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తారు. మరికొందరు రిజర్వేషన్ చేసుకొని జర్నీకి ప్రిపేర్ అవుతారు. అయితే ఒక్కోసారి మనకు అనుగుణంగా టికెట్లు లభించకపోవచ్చు. దీంతో తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. తత్కాల్ టికెట్ బుక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కన్ఫామ్ టికెట్ మెసేజ్ వచ్చేవరకు కూడా ఆందోళన గానే ఉంటుంది.
సాధారణంగా కన్ఫామ్ టికెట్ అనేది చార్ట్ ప్రిపేర్ కాకముందే తెలిసిపోతుంది.అయితే ఈ చార్ట్ ప్రిపేర్ అనేది ఇప్పటివరకు ట్రైన్ స్టార్ట్ అయ్యే నాలుగు గంటల ముందు జరిగేది. అంటే ఒక ట్రైన్ ప్రయాణానికి సిద్ధమైన నాలుగు గంటలకు ముందు చార్ట్ ప్రిపేర్ అయ్యి టికెట్ కన్ఫర్మేషన్ వచ్చేది. ఈ తరుణంలో టికెట్ దక్కని వారు ఇతర టికెట్ లేదా మరో ఏర్పాట్లు చేసుకునే సౌకర్యం ఉండేది.
Also Read: ‘కల్కి’ లాంటి ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసిన రామ్ చరణ్..డైరెక్టర్ ఎవరంటే!
అయితే ఈ చార్ట్ ప్రిపేర్ అనేది కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉండడంవల్ల కొందరు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వివిధ మార్గాల ద్వారా రైల్వే బోర్డుకు విన్నవించారు. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత వెంటనే ట్రైన్ స్టార్ట్ కావడంతో టికెట్ దక్కని వారు ఇతర ఏర్పాట్లు చేసుకునే సమయం లేక పోయింది. దీనిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే బోర్డు కొత్తగా ఈ టైంను పెంచింది. అంటే ఇప్పుడు చార్ట్ ప్రిపేర్ ట్రైన్ స్టార్ట్ అయ్యే ఎనిమిది గంటల ముందు రెడీ అవుతుంది. అంతకుముందు కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉండేది. ఇప్పుడు మరో నాలుగు గంటలకు పెంచారు. దీంతో ప్రయాణికులు తమకు అనుగుణంగా టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే ఈ నిబంధనలు ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో మాత్రమే ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మిగతా ఏరియాల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రైన్ జర్నీ చేసేవారు తమ ఏరియాల్లో ఈ నిబంధన ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాతనే చాట్ ప్రిపేర్ గురించి ఆలోచించాలి.