Chandrababu : చంద్రబాబు అంటే అంతే బై.. 

చంద్రబాబు 2019లో తాను ఏం పెద్ద తప్పు చేశానో చెప్పుకొచ్చాడు. నాడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసి మోడీని గద్దెదించడానికి ప్రత్యేక విమానం మాట్లాడుకొని మరీ చంద్రబాబు దేశమంతా తిరిగారు.

Written By: NARESH, Updated On : April 26, 2023 10:34 am
Follow us on

Chandrababu : ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో మన చంద్రాలు సార్ ను మించిన తోపు నాయకుడు లేడని రాజకీయవర్గాల్లో చెవులు నిజంగానే కొరుక్కుంటారు. బాబు అంటే అంతే బై. ఆయన రాజకీయంగా రంగులు మార్చడంలో దిట్ట అంటుంటారు. మోడీని ఓడించాలని పంతం పట్టి.. ఇప్పుడు బీజేపీ దేశంలో ప్రభల శక్తిగా ఉండడంతో దాన్ని ఎదురించలేక ఇలా చంద్రబాబు అస్త్రసన్యాసం చేస్తున్నారు.. మళ్లీ బీజేపీ ఓడి మోడీ ప్రధానిగా దిగిపోతే ఇదే నోటితో మోడీ విధానాలను చంద్రబాబు తూర్పారపట్టగలరు. అందుకే రాజకీయాల్లో రంగులు మార్చే చంద్రబాబునే ‘ఊసరవెళ్లి’ అని కీర్తిస్తుంటారు.

‘చావు కబురు చల్లగా చెప్పారు మన బాబు గారు’.. అవును ఆయన రాజకీయ చావుకు కారణాన్ని చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా విడమరిచి చెప్పుకొచ్చాడు. చేసిన పాపం చెబితే పోతుందన్న సామెతను గుర్తు చేస్తూ మీడియా ముందు పశ్చాత్తాపపడ్డాడు. కానీ జరగాల్సిన నష్టం ఇప్పటికీ జరిగిపోయింది. దీన్ని ఎవ్వరూ మార్చలేదు. ఆ తలరాతను తలుచుకొని ఇప్పుడు చంద్రబాబు బాధపడితే ఏం లాభం. అందుకే ఈ విలాపం ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

తాజాగా చంద్రబాబు ఓ కార్యక్రమంలో పాల్గొని బోరుమన్నారు. ఓ సదస్సులో వర్చువల్ గా మాట్లాడిన చంద్రబాబు 2019లో తాను ఏం పెద్ద తప్పు చేశానో చెప్పుకొచ్చాడు. నాడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసి మోడీని గద్దెదించడానికి ప్రత్యేక విమానం మాట్లాడుకొని మరీ చంద్రబాబు దేశమంతా తిరిగారు. ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీ నేతలను కలిశారు. అయితే ఆ ఎన్నికల్లో మోడీ గెలిచాడు. చంద్రబాబు ఏపీలో జగన్ చేతిలో చావుదెబ్బ తిన్నారు. ఇప్పుడు మోడీయే కరెక్ట్ తాను రాంగ్ అని చంద్రబాబు బాధపడ్డారు.

ఎన్డీఏ అభివృద్ధి విధానాలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ వల్లే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ అభివృద్ధి విధానాలతో ఏకీభవిస్తున్నట్టు తన తప్పును అంగీకరించి లెంపలేసుకున్నాడు. ‘మోడీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారు. మోడీ వల్లే ఇవాళ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. భారత్ ను గుర్తిస్తోంది. మోడీ తెస్తున్న మార్పులు దేశఆన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రధాని విధానాలను మెరుగుపెడితే 2050 నాటికి భారత్ దే అగ్రస్థానం రూ.500 కంటే పెద్దనోట్ల రద్దు చేయాలని ప్రతిపాదిస్తున్నా’ అని చంద్రబాబు చెప్పుకొచ్చాడు.

అయితే ఇదే పెద్దమనిషి మోడీకి పెద్దనోట్లు రద్దు చేయమని సలహా ఇచ్చిందే తాను అని బయట గొప్పలు చెప్పుకున్నాడు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక మాత్రం మోడీ పెద్దనోట్ల రద్దుతోనే దేశం దివాళా తీసిందని గగ్గోలు పెట్టాడు. ఇప్పుడు మోడీనే దేవుడు అంటూ పొగుడుతున్నాడు.