CM Chandrababu: ఏపీలో గ్రామీణ రహదారులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ రహదారులను మినహాయిస్తే.. రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కనీస ఆనవాళ్లు లేకుండా పోయాయి. వీటిపై గుంతలను పూడ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో రోడ్డుపై గొంతలు పూడ్చి కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. గత ఐదేళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో జగన్ సర్కార్ పై ఒక రకమైన విమర్శ ఉంది. అందుకే చంద్రబాబు సర్కార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలోనే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రోడ్లను సైతం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి వీటి నిర్వహణను అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటన చేశారు. మొదట దీనిని ప్రయోగాత్మక అమలు చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ముందుగా ఈ ప్రయోగం చేయనున్నారు. అక్కడ విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. అయితే వీటిపై టోల్ ఫ్రీ కూడా వసూలు చేయబోతున్నారు.
* పైలెట్ ప్రాజెక్టు
జాతీయ రహదారులపై టోల్ వసూలు చేసే ప్లాజాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదే మాదిరిగా రాష్ట్ర రహదారులపై సైతం టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. అ మార్గంలో వెళ్లే బస్సులు, లారీలు, కార్ల నుంచి టోల్ వసూలు చేయబోతున్నారు. ముందుగా ఉభయగోదావరి జిల్లాల్లో రహదారులను అభివృద్ధి చేసి.. ఈ ప్లాజాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాలకు దీనిని విస్తరిస్తారన్నమాట. ప్రధానంగా గ్రామీణ రహదారులు దారుణంగా తయారయ్యాయి. వాటిని బాగు చేయడానికి భారీగా నిధులు అవసరం. అదే సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ తరుణంలో టోల్ ప్లాజా ల ద్వారా వసూలు తప్పనిసరిగా మారింది.
* ఐదేళ్లుగా నిర్వహణ నోచుకోక
రాష్ట్రవ్యాప్తంగా అంతర్ రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. గత ఐదేళ్లలో కనీస స్థాయిలో కూడా నిర్వహణకు నోచుకోలేదు. పక్క రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పర్యటించే సమయంలోరాష్ట్ర రహదారుల పరిస్థితిని ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నాడు జగన్ సర్కార్ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రహదారుల పరిస్థితి పై అధ్యయనం చేసింది. జిల్లాల వారీగా బాగు చేయాల్సిన రహదారుల గురించి సమగ్ర నివేదిక రూపొందించింది. అయితే ఈ రహదారుల మరమ్మతులకు భారీగా నిధులు అవుతాయని భావిస్తోంది. అందుకే ప్రైవేట్, పబ్లిక్ విధానంలో బాగు చేయాలని చూస్తోంది. అందులో భాగంగానే టోల్ వసూలు చేయనుంది.